English | Telugu

'టైగర్ నాగేశ్వరరావు' మూవీ యూఎస్ రివ్యూ.. మాస్ రాజా ఫ్యాన్స్ కి మళ్ళీ నిరాశే!

మాస్ మహారాజా రవితేజ నటించిన పాన్ ఇండియా మూవీ 'టైగర్ నాగేశ్వరరావు'. అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ చిత్రానికి వంశీ దర్శకుడు. స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా నేడు(అక్టోబర్ 20న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవితేజ నటించిన మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో పాటు ఆసక్తికర బయోపిక్ కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను అందుకోవడంతో ఈ మూవీ పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోయింది.

సినిమా ఎంతో ఆసక్తికరంగా మొదలైంది. మురళి శర్మ పీఎంఓ కి టైగర్ నాగేశ్వరరావు కథ చెబుతున్నట్లుగా సినిమా ప్రారంభమైంది. టైగర్ ని పరిచయం చేస్తూ చూపించిన ట్రైన్ రాబరీ సీక్వెన్స్ అదిరిపోయింది. చిన్న దొంగ నుంచి గ్యాంగ్ స్టర్ స్థాయికి ఎదిగినట్టుగా చూపించిన సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి. అయితే లవ్ స్టోరీనే పంటికింద రాయిలా కథకి అడ్డు పడినట్టు ఉంది. అలాగే పీఎంఓ లో దొంగతనం కూడా ఓవర్ ది టాప్ వెళ్ళినట్టు అనిపించింది. ఓవరాల్ గా ఫస్టాప్ ఆశించిన స్థాయిలో కాకపోయినా.. బాగానే ఉంది.

సెకండాఫ్ లో రక్తపాతం ఎక్కువైంది. పైగా నిడివి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉంది. ఇలాంటి కథలను ఎంత సహజంగా చెప్తే అంత బాగుంటుంది. కానీ దర్శకుడు సినిమాటిక్ లిబర్టీ పేరుతో ఓవర్ ది టాప్ సన్నివేశాలతో ఆ కిక్ పోగొట్టాడు. వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా దారుణంగా ఉంది.

టైగర్ నాగేశ్వరరావు లాంటి యూనిక్ రోల్ లో రవితేజ యాక్టింగ్ ఇరగదీశాడు. రవితేజ కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ లలో ఒకటని చెప్పొచ్చు.

అంచనాలతో ఈ సినిమాకి వెళ్తే మాత్రం నిరాశ తప్పదు. అంచనాలు పెట్టుకోకుండా ఓ కొత్త సెటప్ ని, కొత్త రవితేజని చూడాలనే ఉద్దేశంతో వెళ్తే అంతోఇంతో సినిమా నచ్చే అవకాశాలు ఉన్నాయి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.