English | Telugu

ప్రభాస్ రాజా సాబ్ కి  సాయం చేస్తున్న చిరంజీవి ఫ్యాన్స్

తన కటౌట్ కి ఉన్న సత్తా ఏ పాటిదో ప్రభాస్ (prabhas)తన రీసెంట్ హిట్ కల్కి(kalki)తో మరోసారి సాటి చెప్పాడు. వెయ్యి కోట్ల క్లబ్ లో చేరి తన రికార్డుని తనే బద్దలు కొట్టాడు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ కి సంబంధించిన విషయాల గురించి సోషల్ మీడియాని చెక్ చేస్తున్నారు. ఈ క్రమంలో వాళ్ళు నిజమని అనుకున్న ఒక న్యూస్ అబద్దం అని తెలిసింది.

ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ లో రాజా సాబ్(raja saab)ఒకటి. ఇంకా పూర్తిగా చెప్పాలంటే ది రాజా సాబ్. మారుతీ (maruthi)దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ మీద ఫ్యాన్స్ లోనే కాదు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి.కొంత భాగం షూటింగ్ ని కూడా జరుపుకుంది. పైగా ఈ మూవీకి ఉన్న స్పెషల్ ఏంటంటే చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత వింటేజ్ ప్రభాస్ కనిపించబోతున్నాడు. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, ఏక్ నిరంజన్ లాంటి సినిమాల కోవలో కనువిందు చేయనున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే రాజా సాబ్ లో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచిన ఓ కైకే పాన్ బనారస్ వాలా సాంగ్ ని రీమేక్ చేశారనే వార్తలు వచ్చాయి. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తనదైన స్టైల్ తో సరికొత్త మ్యూజిక్ తో అదరగొట్టాడని, ప్రభాస్ కూడా ఒక రేంజ్ లో మాస్ స్టెప్పులు వేసాడనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు అవి రూమర్స్ అని తేలిపోయాయి.

రాజా సాబ్ లో అమితాబ్ (amithab bachchan)సాంగ్ అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని బేబీ నిర్మాత ఎస్ కె ఎన్(skn)సోషల్ మీడియా ద్వారా తెలియ చేసాడు. ఎస్ కె ఎన్ కి ఈ విషయం ఎలా తెలుసనీ మీరు అనుకోవచ్చు. దర్శకుడు మారుతికి ఎస్ కె ఎన్ మంచి ఫ్రెండ్. అదే విధంగా చిరంజీవి కి వీరాభిమాని కూడా అనుకోండి. కాకపోతే ఇక్కడో విషయం చెప్పుకోవాలి. ఆ సాంగ్ ని దివంగత నందమూరి తారక రామారావు(ntr)తన యుగంధర్ సినిమాలో వాడారు. వోరబ్బా వేసుకున్నా కిల్లి అనే లిరిక్ తో స్టార్ట్ అవుతుంది. ఎన్టీఆర్ పెర్ ఫార్మెన్స్ అయితే అదిరిపోతుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.