English | Telugu

రాజాసాబ్ రిలీజ్ వాయిదా పడనుందా?..ఆ ఎఫెక్ట్ ఫలితమేనా!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas)ఫస్ట్ టైం'ది రాజాసాబ్'(the raja saab)తో హర్రర్ కామెడీ జోనర్ ని టచ్ చేస్తున్న విషయం తెలిసిందే.ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అక్టోబర్ 23 న రిలీజైన ఫస్ట్ మోషన్ గ్లింప్స్ 'రాజా సాబ్' ఏ స్థాయిలో తెరకెక్కబోతుందో చెప్పకనే చెప్పింది.మరి ముఖ్యంగా ప్రభాస్ ఓల్డ్ లుక్ ని చూసిన అభిమానులు,మూవీ లవర్స్ అయితే 'రాజా సాబ్' ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని ఎదురుచూస్తే పరిస్థితి.

ఇక 'రాజా సాబ్' నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 10 న థియేటర్స్ లోకి రాబోతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారకంగా ప్రకటించారు కూడా.దీంతో వేసవికి ప్రభాస్ హంగామా షురు అని అందరు అనుకున్నారు.కానీ ఇప్పుడు 'రాజాసాబ్' వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే రూమర్స్  ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.ఇటీవల షూటింగ్ లో ప్రభాస్ కి కాలి కండ నరాలు పట్టేయ్యడంతో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు.ఈ విషయంలో ప్రభాస్ ని కొన్ని రోజుల పాటు డాక్టర్స్ రెస్ట్ తీసుకోమన్నారని, దాంతో షూటింగ్ లేట్ అయ్యేలా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంతోనే ఏప్రిల్ 10 న 'రాజాసాబ్' రాకపోవచ్చని అంటున్నారు.సోషల్ మీడియాలో కూడా ఈ న్యూస్ వైరల్ అవుతున్న నేపథ్యంలో మేకర్స్  రియాక్షన్ ఈ విధంగా ఉంటుందో చూడాలి.

'రాజాసాబ్' ని దర్శకుడు మారుతీ(maruthi)అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్నాడు,తన కెరీర్ లో తొలిసారి పాన్ ఇండియా స్టార్ తో,పాన్ ఇండియా మూవీ చేస్తుండంతో, సినిమాకి సంబంధించిన ప్రతి విషయంలోను ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా తమ బ్యానర్ లో 'రాజాసాబ్' ఒక సూపర్ డూపర్ హిట్ గా నిలిచిపోతుందని ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది.నిధి అగర్వాల్(nidhhi agerwal)మాళవిక మోహనన్(malavika mohanan)హీరోయిన్లు గా చేస్తున్న ఈ మూవీలో ప్రభాస్ డ్యూయల్ రోల్ అనే టాక్ కూడా ఉంది.థమన్(thaman)మ్యూజిక్ ని  అందిస్తున్నాడు.