English | Telugu

స్వర్ణయుగం చూసిన సంధ్య థియేటర్‌కి షాక్‌.. శాశ్వత చర్య తప్పదా?

ప్రస్తుతం మనకు ఎంటర్‌టైన్‌మెంట్‌ అనేది వివిధ మాధ్యమాల ద్వారా అందుతోంది. ప్రజలకు వినోదాన్ని, ఉల్లాసాన్ని ఇచ్చేందుకు పలు సాధనాలు అందుబాటులో ఉన్నాయి. ఎవరికి ఏది నచ్చితే దానిలోనే తమ ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. కానీ, పాతరోజుల్లో అలా కాదు. వినోదం అంటే సినిమా, ఉల్లాసం అంటే సినిమా. సినిమా చూడాలంటే ప్రతి ఒక్కరూ థియేటర్‌కి వెళ్లాల్సిందే. అదే సినిమా మళ్ళీ చూడాలంటే మళ్ళీ థియేటర్‌కే వెళ్లాలి. అలా ఆరోజుల్లో థియేటర్‌కి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఒకప్పుడు ఎసి థియేటర్‌ అనేది ఉండేది కాదు. అక్కడక్కడ ఎయిర్‌ కూల్డ్‌ అనే పేరుతో కొన్ని థియేటర్లు ఉండేవి. రాను రాను ప్రేక్షకులకు సినిమా అనేది ఒక ప్రధాన సాధనం అయిన తర్వాత తమ థియేటర్లను ప్రేక్షకులను ఆకర్షించే విధంగా యాజమాన్యం ఎన్నో మార్పులు చేస్తూ వచ్చింది. కొన్ని చోట్ల కొత్త థియేటర్లు కూడా వెలిశాయి. అలాంటి సమయంలోనే ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో సంధ్య థియేటర్‌ను నిర్మించారు.

ఒకప్పుడు అన్నీ 35ఎంఎం సినిమాలే ఉండేవి. ఆ తర్వాతి కాలంలో సినిమాస్కోప్‌ ఫార్మాట్‌ వచ్చింది. ఆ సమయంలో 70ఎంఎం థియేటర్‌ అనేది ప్రేక్షకుడికి ఒక అద్భుతమైన అనుభూతిగా ఉండేది. దేశంలో 70 ఎంఎం థియేటర్లు చాలా తక్కువగా ఉండేవి. అలాంటి సమయంలో 1980లో సంధ్య 70ఎంఎం థియేటర్‌ ప్రారంభమైంది. ఆ థియేటర్‌లో మొదటి సినిమాగా ‘షాలిమార్‌’ను ప్రదర్శించారు. ఆ తర్వాత బాలీవుడ్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘షోలే’ని రిలీజ్‌ చేశారు. 1975లో విడుదలైన ‘షోలే’ చిత్రాన్ని 70ఎంఎం స్టీరియోఫోనిక్‌ సౌండ్‌తో నిర్మించారు. అయితే దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ సినిమా 35ఎంఎం ఫార్మాట్‌లోనే రిలీజ్‌ అయింది. కొన్ని ముఖ్యమైన పట్టణాల్లో మాత్రమే 70ఎంఎంతోపాటు స్టీరియోఫోనిక్‌ సౌండ్‌ కూడా అందుబాటులో ఉండేది. ‘షోలే’ ఆరోజుల్లో ఎన్నిసార్లు రీరిలీజ్‌ అయినా అద్భుతమైన కలెక్షన్స్‌ రాబట్టేది. అలాంటి పరిస్థితుల్లో సంధ్య థియేటర్‌లో 70ఎంఎం ఫార్మాట్‌లో ‘షోలే’ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సినిమా మరోసారి బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. అప్పటి నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ దృష్టి కూడా సంధ్య థియేటర్‌పై పడింది. తమ సినిమాల రిలీజ్‌లో ఆ థియేటర్‌కి ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టారు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో అప్పటికే సుదర్శన్‌, దేవి, ఓడియన్‌ థియటర్స్‌ ఉండేవి. అయినా టాలీవుడ్‌ హీరోలు తమ సినిమా తప్పకుండా సంధ్య థియేటర్‌లో రిలీజ్‌ అవ్వాలని కోరుకునేవారు. హైదరాబాద్‌లో మెయిన్‌ థియేటర్‌ అంటే సంధ్య అనే పేరు వచ్చేసింది. ఏ సినిమా రిలీజ్‌ అయినా దానికి సంబంధించిన హీరో, హీరోయిన్‌, ప్రధాన సాంకేతిక వర్గం అంతా మొదటిరోజు సినిమా చూసేందుకు సంధ్యకు వెళ్ళేవారు. ఈ థియేటర్‌ కోసం హీరోల మధ్య పోటీ కూడా ఉండేదంటే ఆశ్చర్యం కలగకమానదు. ప్రేక్షకుల్నే కాదు, హీరోలను, దర్శకనిర్మాతలను కూడా ఈ థియేటర్‌ అంత ప్రభావితం చేసింది. సంధ్య థియేటర్‌ ఖాళీ లేకపోతే అది ఖాళీ అయ్యే వరకు తమ సినిమా రిలీజ్‌ని వాయిదా వేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాతి రోజుల్లో సంధ్య థియేటర్‌కి ప్రాధాన్యం మరింత పెరిగింది.

అదే సమయంలో ఆ ప్రాంగణంలోనే 1981లో సంధ్య 35 ఎంఎం థియేటర్‌ని కూడా నిర్మించారు. వాస్తవానికి 70ఎంఎం థియేటర్‌ ఒక్కటే ఉన్నప్పుడు ఎంతో విశాలంగా, పార్కింగ్‌కి కూడా అనువుగా ఉండేది. రెండో థియేటర్‌ కూడా మొదలైన తర్వాత సమస్యలు మొదలయ్యాయి. పైగా సిటీలో ట్రాఫిక్‌ విపరీతంగా పెరగడం, సంధ్య థియేటర్‌ క్రాస్‌ రోడ్స్‌కి దగ్గరలో ఉండడం వంటి కారణాల వల్ల సినిమాకి వచ్చేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌ సిటీలో ఇప్పటికే చాలా మల్టీప్లెక్స్‌లు వచ్చేశాయి. అయినా సంధ్య థియేటర్‌కి ఉండే స్థానం దానికి ఉంది. కానీ, ‘పుష్ప2’ రిలీజ్‌ సందర్భంగా జరిగిన ఘటన కారణంగా నాలుగు దశాబ్దాలుగా ఆ థియేటర్‌కి ఉన్న ప్రాధాన్యం ఒక్కసారిగా పడిపోయింది. కుటుంబంతో కలిసి సంధ్య థియేటర్‌కి వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. గత 15 రోజులుగా ఈ థియేటర్‌లోని ఘటనకు సంబంధించిన రకరకాల పరిణామాలు చూస్తున్నాం. తాజాగా పోలీస్‌ శాఖ ఈ థియేటర్‌ని పరిశీలించి, అందులో ఉన్న కొన్ని లోపాల గురించి ప్రస్తావించింది. పుష్ప2 రిలీజ్‌ సందర్భంగా జరిగిన ఘటనకు నిర్వహణ లోపం కూడా ఒక కారణమని పోలీసులు తేల్చారు. చివరికి థియేటర్‌కి సంబంధించిన కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ థియేటర్‌ యాజమాన్యానికి షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. థియేటర్‌ నిర్వహణలోని లోపాలను ఎత్తిచూపుతున్న పోలీసులు ఆ కారణంతోనే సినిమాటోగ్రాఫ్‌ లైసెన్స్‌ని కూడా రద్దు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. థియేటర్‌లో జరిగిన ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ట్రాఫిక్‌కి ఇబ్బందులు కలిగిస్తుందనే కారణంతో థియేటర్‌ను శాశ్వతంగా మూయించే అవకాశం కనిపిస్తోంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .