English | Telugu

The Game web series Review: ది గేమ్: యు నెవ్వర్ ప్లే ఎలోన్ 

వెబ్ సిరీస్ : ది గేమ్: యు నెవ్వర్ ప్లే ఎలోన్
నటీనటులు: శ్రద్ధా శ్రీనాథ్, సంతోష్ ప్రతాప్, చాందిని, శ్యామ హరిణి, బాల హసన్, సుభాష్ తదితరులు
రచన : దీప్తి గోవిందరాజన్
ఎడిటింగ్: మణిమారన్
సినిమాటోగ్రఫీ: అఖిలేష్ కాతముత్తు
మ్యూజిక్: సిమన్ కె.కింగ్
నిర్మాతలు: సమీర్ నయ్యర్, ప్రమోద్ చెరువలత్
దర్శకత్వం: రాజేశ్ ఎం. సెల్వ
ఓటీటీ : నెట్ ఫ్లిక్స్

కథ:

ఒక ఆనిమేషన్ కంపెనీలో కావ్య రాజారామ్ (శ్రద్ధా శ్రీనాథ్) గేమ్ డెవలపర్. తన సంస్థలోనే పనిచేస్తున్న అనూప్ (సంతోష్ ప్రతాప్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. సామాజిక మాధ్యమాల వేదికగా ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే కావ్య తరచూ ట్రోల్స్ కు గురవుతూ ఉంటుంది. 'గ్లాస్ సీలింగ్ ' పేరుతో ఆమె డిజైన్ చేసిన గేమ్ కు అవార్డు కూడా లభిస్తుంది. అవార్డు అందుకున్న రోజు రాత్రి స్నేహితురాలిని కలుద్దామని వెళ్లిన కావ్యపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేస్తారు. తీవ్ర గాయాలపాలైన ఆమె దగ్గరి నుంచి పర్సు, ఫోన్, అవార్డును తీసుకొని వెళ్లిపోతారు. దీంతో ఇన్‌స్పెక్టర్ భానుమతి (చాందిని) కేసును విచారించడం మొదలు పెడుతుంది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ తో పాటుగా తన ఆఫీస్ లోని టెక్ టీమ్ సాయంతో కావ్య వారిని వెతుకుతుంటుంది. ఇంతకు కావ్యపై దాడి చేసింది ఎవరు? అనూప్ తయారుచేసిన గేమ్ లోని పాత్రకు సంబంధించి మాస్క్ ధరించి దాడి చేయడానికి కారణం ఏంటి? దీని వెనుకున్న వ్యక్తుల్ని ఎలా కనిపెట్టారన్నది మిగతా కథ.

విశ్లేషణ:

సైబర్ బ్లాక్ మెయిల్, ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ ఇలా నిత్యం యూత్ ని ట్రాప్ చేస్తూ కొంతమంది ఉంటారు. అలాంటి ఒక పాయింట్ తో చిన్నపిల్లలకి మెసెజ్ ఇస్తూ ఈ ' ది గేమ్' వెబ్ సిరీస్ సాగుతుంది. ఈ సిరీస్ మొత్తంగా ఏడు ఎపిసోడ్ లగా ఉంటుంది. ఈ సిరీస్ ట్రైలర్ చూసిన వాళ్ళెవరైనా .. ఒక గేమ్ గురించి ఉంటుందని అనుకుంటారు. కానీ ఎవరి ఊహలకి అందకుండా సాదాసీదాగా వెళ్తుంది.

గేమ్ నుంటి మొదలుపెట్టి ఎటో ఎటో స్టోరీ వెళ్తుంది. సైబర్ ఎటాక్ జరిగితే ఏం చేస్తారనేది.. ఇంతకముందు చాలా సిరీస్ లలో చూసాం.. అదే పంథాలో ఇది వెళ్తుంది. కొత్తగా ఏదైనా ఉంటుందేమోనని చూడాలని అనుకునేవారికి నిరాశే ఎదురవుతుంది. అయితే చిన్నపిల్లలని దృష్టిలో ఉంచుకొని చేసిన పాయింట్ ఎంగేజింగ్ గా సాగుతూ థ్రిల్ ఇస్తుంది.

ప్రతీ వెబ్ సిరీస్ లో లాగే ఇందులో కూడా చివరి రెండు ఎపిసోడ్ లు ట్విస్ట్ లు పెట్టాడు దర్శకుడు. చివరి ఎపిసోడ్ గ్రిస్పింగ్ గా ఉంటుంది. మొదటి అయిదు ఎపిసోడ్ లో స్లోగా సాగుతుంది. గేమ్ డెవలపర్స్ గురించి కాన్సెప్ట్ తక్కువగా ఉండటం.. సైబర్ ఎటాక్ పార్ట్ ఎక్కువగా ఉండటంతో ఇది టైటిల్ కి సంబంధం లేకుండా.. రొటీన్ ప్రెడిక్టెబుల్ సిరీస్ జాబితాలో చేరింది. ఆ గేమింగ్ గురించి ఇంకాస్త ఉండి ఉంటే బాగుండేది. ఎడిటింగ్ లో స్లో సీన్లని తీసేసి ఉంటే కనీసం డీసెంట్ థ్రిల్లర్ సిరీస్ ల జాబితాలో అయినా ఈ 'ది గేమ్' చేరేది.

యువతని దృష్టిలో ఉంచుకొని తీసిన కొన్ని సీన్లు బాగుంటాయి. అయితే అవి కూడా సస్పెన్స్ లేకుండా ముందుగానే ఊహించేవిధంగా ఉంటాయి. అది పెద్ద మైనస్. కొన్ని సీన్లని చూస్తే ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది. దర్శకుడు ఎంచుకున్నా కథా పాయింట్ మంచిదే అయినప్పటికీ దానిని ప్రెజెంట్ చేయటంలో దర్శకుడు సక్సెస్ కాలేకపోయాడు. ఎడిటింగ్ లో కాస్త జాగ్రత్త పడాల్సింది. అడల్ట్ సీన్లు లేవు.. అశ్లీల పదాలు వాడలేదు.‌. బిజిఎమ్ ఒకే. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

కావ్య పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ ఆకట్టుకుంది. అనూప్ గా సంతోష్ ప్రతాప్, ఇన్ స్పెక్టర్ భానుమతిగా చాందిని తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. ఇక మిగతా వారు వారి పాత్రలకి పూర్తి న్యాయం చేశారు.

ఫైనల్ గా : స్లో ఫేజ్ డ్ ఎంగేజింగ్ థ్రిల్లర్.. వన్ టైమ్ వాచెబుల్.

రేటింగ్ : 2 / 5

✍️. దాసరి మల్లేశ్

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .