English | Telugu
Akhanda 2: దటీజ్ బాలయ్య.. నిజాయితీ అంటే ఇది..!
Updated : Dec 5, 2025
అఖండ 2 వాయిదా
మళ్ళీ బయటపడిన బాలయ్య నిజాయితీ
నటసింహం నందమూరి బాలకృష్ణ(Nanadamuri Balakrishna) నటించిన 'అఖండ 2: తాండవం'(Akhanda 2: Thaandavam) చివరి నిమిషంలో వాయిదా పడింది. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకి, 'అఖండ 2'ని నిర్మించిన 14 రీల్స్ ప్లస్ కి మధ్య నెలకొన్న ఆర్ధిక సమస్యల కారణంగా పోస్ట్ పోన్ అయింది. బాలకృష్ణ తలచుకుంటే తన పవర్ ని ఉపయోగించి, సినిమా వాయిదా పడకుండా ఆపగలరు. కానీ, బాలయ్య ఆ పని చేయలేరు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ఆసక్తికర చర్చ.
సినీ రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ బాలకృష్ణకు ఎంతో పట్టుంది. ఒక్క ఫోన్ కాల్ తో పరిస్థితులు చక్కదిద్దగల పవర్ ఆయన సొంతం. హిందూపురం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఉన్నారు బాలయ్య. అలాగే, ఆయన బావ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దానికి తోడు, టీడీపీ మద్దతిచ్చిన మోడీ సర్కార్ కేంద్రంలో అధికారంలో ఉంది.
బాలకృష్ణ తలచుకుంటే అవసరమైతే కేంద్ర పెద్దల నుంచి అయినా ఒత్తిడి తీసుకొచ్చి.. ఈరోస్ సంస్థని వెనక్కి తగ్గేలా చేయొచ్చు. బాలయ్య తన పవర్ ని ఉపయోగించి.. అసలు ఈ విషయాన్ని వాయిదా వరకు రాకుండా ఆపగలరు. కానీ, బాలకృష్ణ ఆ పని చేయలేదు. చేయరు కూడా.
Also Read: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న అఖండ-2..!
రాజకీయాల్లో ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలు సహజం. కానీ, బాలయ్య కుటుంబంపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు. అవినీతి చేయడం, అధికారాన్ని అడ్డు పెట్టుకొని సొంత పనులు చక్కబెట్టుకోవడం.. బాలకృష్ణకు తెలియదు. ఆ నిజాయితీనే ఇప్పుడు 'అఖండ 2' విషయంలోనూ ప్రదర్శిస్తున్నారు.
బాలయ్య తన పవర్ ని ఉపయోగించకుండా.. న్యాయబద్ధంగానే తన నిర్మాతలను పోరాడేలా చేస్తున్నారు. అలా అని నిర్మాతలను వదిలేయకుండా.. ఈ కష్ట సమయంలో ఒక కథానాయకుడిగా వారి పక్కన నిలబడ్డారు. బాలకృష్ణ స్థానంలో వేరే వాళ్ళు ఉంటే.. తన ప్రతిష్టాత్మక సినిమా వాయిదా పడుతుంటే.. ఇంత నిజాయితీగా ఉండటం దాదాపు అసాధ్యం. కానీ, బాలయ్య మాత్రం తన పవర్ ని ఉపయోగించకుండా.. నిజాయితీగా న్యాయపోరాటం చేస్తున్నారు. అందుకే అభిమానులంతా దటీజ్ బాలయ్య అంటూ ప్రశంసిస్తున్నారు.