English | Telugu

ప్రశాంత్‌ నీల్‌ కండిషన్‌తో ఎన్టీఆర్‌కు 20 రోజులు ఇబ్బంది తప్పదు!

- ఎన్టీఆర్‌కు నిద్ర‌లేని రాత్రులు త‌ప్ప‌వు
- య‌శ్‌, ప్ర‌భాస్‌ని మించే రేంజ్‌లో ఎన్టీఆర్‌
- ఆ యాక్ష‌న్ సీక్వెన్సే కీల‌కం

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ఓ భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కెజిఎఫ్‌ సిరీస్‌, సలార్‌ చిత్రాలతో ప్రశాంత్‌ నీల్‌ ఎలాంటి ప్రభంజనం సృష్టించాడో మనం చూశాం. వాటిని మించే స్థాయిలో ఎన్టీఆర్‌తో చేసే సినిమా ఉంటుందని ఇప్పటికే ప్రచారం ఊపందుకుంది. ఎందుకంటే ప్రశాంత్‌ అభిమాన హీరో ఎన్టీఆర్‌. ఇంతకుముందు యశ్‌, ప్రభాస్‌ల హీరోయిజాన్ని ఒక రేంజ్‌లో ఎలివేట్‌ చేశారు ప్రశాంత్‌. ఇప్పుడు ఎన్టీఆర్‌ని అంతకు మించి ఎక్స్‌పోజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేసినట్టు తెలుస్తోంది.


ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి కొంత షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది. అయితే రెండు నెలల నుంచి ఎలాంటి షూట్ జరగడం లేదు. దీంతో సోషల్‌ మీడియాలో నెగెటివ్‌ ప్రచారం మొదలైంది. సినిమా ఆగిపోయిందంటూ రకరకాల పోస్టులు పెట్టారు. కానీ, విషయం అది కాదని, ఒక భారీ షెడ్యూల్‌ కోసం చేస్తున్న ప్లానింగ్‌లో భాగంగా కొంతకాలం షఉటింగ్‌కి బ్రేక్‌ ఇచ్చారని తెలుస్తోంది.


తాజా సమాచారం మేరకు ఈ సినిమాకి సంబంధించిన తాజా షెడ్యూల్‌ను రామోజీ ఫిలింసిటీలో ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌కి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే.. ఈ షెడ్యూల్‌ అంతా నైట్‌ ఎఫెక్ట్‌లోనే ఉంటుందట. అది కూడా ఎన్టీఆర్‌ పాల్గొనే భారీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ అని తెలుస్తోంది. ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ను రాత్రి మాత్రమే షూట్‌ చెయ్యాలని ప్రశాంత్‌ నీల్‌ పెట్టిన కండిషన్‌ కారణంగా పూర్తిగా ఈ ఎపిసోడ్‌పైనే యూనిట్‌ దృష్టి పెట్టింది. యాక్షన్‌ సీక్వెన్స్‌కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారట.


ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ సినిమాకి కీలకం అని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్‌ కోసమే ఎన్టీఆర్‌ కొన్నాళ్లుగా ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ కోసం కృషి చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఎన్టీఆర్‌ ఫిజిక్‌ పూర్తిగా మారిపోయిందంటూ రకరకాల కామెంట్స్‌ వినిపించాయి. ఈ షెడ్యూల్‌తో సినిమాకి సంబంధించిన మేజర్‌ పార్ట్‌ షూటింగ్‌ పూర్తయినట్టే అంటున్నారు. దీని తర్వాత పాటల చిత్రీకరణ, ఆ తర్వాత కొన్ని బ్యాలెన్స్‌ చిత్రీకరణ జరుగుతుంది. ఈ సినిమాను జూన్‌లో రిలీజ్‌ చేస్తామని గతంలో ప్రకటించారు. షూటింగ్‌ జరుగుతున్న విధానాన్ని బట్టి చూస్తే అనుకున్న డేట్‌కే సినిమాను రిలీజ్‌ చేసే అవకాశం కనిపిస్తోంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .