English | Telugu

టెంప‌ర్ తేడా కొట్టిందా??

ఏ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్ అయినా తీసుకోండి. మా సినిమా బంప‌ర్ హిట్‌.. మా సినిమా సూప‌ర్ హిట్ - రికార్డులు తిర‌గేస్తాం అంటుంటారు. ఇది వ‌ర‌కు ఎన్టీఆర్ కూడా ఇలాంటి మాట‌లు చెప్పిన‌వాడే. ఇక బండ్ల‌గణేష్ అంటారా నా సినిమా బ్లాక్ బ్ల‌స్ట‌ర్ హిట్టే అంటాడాయ‌న‌. కానీ టెంప‌ర్ ఆడియో ఫంక్ష‌న్లో ఇలాంటి మాట‌లేం వినిపించ‌లేదు. స‌రికదా... భిన్న‌మైన స్వ‌రాలు అభిమానుల్ని కంగారు పెట్టాయి. ఈ ఆడియో ఫంక్ష‌న్లో ఎన్టీఆర్ మాట‌ల్ని ఒక్క‌సారి గ‌మ‌నిస్తే... `నాకు హిట్లు వ‌ద్దు.. ఫ్లాపులు వ‌ద్దు` అన్నాడు. ఆయ‌న కాంటెస్ట్ ఏదైనా ఈ మాట‌కు వేరే వేరే అర్థాలు ధ్వ‌నించ‌డం ఖాయం. అంతేనా.. `ఈ సినిమా హిట్ట‌వ్వ‌క‌పోతే మ‌రోటి చేస్తా. అదీ అవ్వ‌క‌పోతే మ‌రోటి చేస్తా..` అంటూ ఏదేదో మాట్లాడాడు. ఎన్టీఆర్ మాటల్లో రీజ‌న్ ఉంది. కానీ... `ఈ సినిమా ఫ్లాప్ అయినా ఫ‌ర్లేదు` అన్న కాన్ఫిడెన్స్ కూడా ఉంది. అదే ఎన్టీఆర్ అభిమానుల్ని కంగారు పెడుతోంది. బండ్ల గ‌ణేష్ అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ గాలి తీసేశాడు. ``సినిమా చూశాక... ఏంటి త‌ప్పు చేశానా అనిపించింది.. `` అంటూ లోప‌ల ఉన్న ఫీలింగ్‌ని క‌క్కేశాడు. ఇవ‌న్నీ అభిమానులు గంపెడాశ‌లు పెట్టుకొన్న టెంప‌ర్‌పై నెగిటీవ్ టాక్ తీసుకొస్తుంది. బ‌య‌ట ఎవ‌రెవ‌రో ఈ సినిమా గురించి నెగిటీవ్‌గా మాట్లాడారంటే ఓ రీజ‌న్ ఉంది. కానీ.. స్వ‌యంగా ఎన్టీఆర్‌, గ‌ణేష్‌లు ఇలా మాట్లాడేస‌రికి ఫ్యాన్స్ లోనూ లేనిపోని అనుమానాలొస్తున్నాయ్‌. ఏదేమైనా... వారి మాట‌లు కేవ‌లం `ఆట‌లో అర‌టి పండు` అనుకొని ఈ టెంప‌ర్ హిట్ట‌వ్వాల‌ని, బ్లాక్ బ్ల‌స్ట‌ర్ అవ్వాల‌ని కోరుకొందాం. ఎందుకంటే ప‌రిశ్ర‌మ‌కు, మ‌రీ ముఖ్యంగా ఎన్టీఆర్‌కూ ఓ సూప‌ర్ హిట్ అవస‌రం మ‌రి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.