English | Telugu

‘టెంపర్' ఆడియో రిలీజ్ హైలైట్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘టెంపర్' ఆడియో వేడుక హైదరాబాద్ శిల్పకళా వేదికలో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఫంక్షన్ లో అందరిది ఒకటే మాట ఎన్టీఆర్‌ సూపర్బ్‌. ఆయన యాక్టింగ్‌ సూపర్బ్‌. టెంపర్‌ సూపర్‌హిట్‌ అన్నదే.

ఆడియో వేడుకకు అతిథులుగా వచ్చిన దర్శకుడు సుకుమార్‌ ముందుగా మాట్లాడుతూ.. టెంపర్‌ సినిమా మిగతావారికి ఏమో కాని.. నాకు మాత్రం చాలా స్పెషల్‌. ఎందుకంటే ఇప్పటికే నేను సినిమా చూశాను. ఎన్టీఆర్‌ సూపర్బ్‌ ఫర్‌ఫామన్స్‌ ఇచ్చాడు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ నా పక్కనే ఉన్నా.. స్క్రీన్‌మీదున్న ఎన్టీఆర్‌ను వెళ్లి హత్తుకోవాలి అనిపించిందంటే ఎన్టీఆర్‌ ఫర్‌ఫామన్స్‌ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.పూరీ జగన్నాధ్‌ గురించి చెప్పాలంటే ఆయన వారం రోజుల్లో కథరాస్తే ఆ సినిమా హిట్టు, రెండు వారాల్లో రాస్తే అది సూపర్‌హిట్టు, టెంపర్‌ సినిమాను ఆయన వంశీతో కలిసి నాలుగు వారాల్లో రాశాడు. కాబట్టి ఇది సూపర్‌హిట్టే.

దిల్‌ రాజు మాట్లాడుతూ.. తాత కొదమసింహం, బాబాయ్‌ రౌడీ ఇన్‌స్పెక్టర్‌, అన్న ఇటీవలే పటాస్‌ అనిపించుకున్నాడు, తమ్ముడేమో టెంపర్‌ ఇక టెంపర్‌ సినిమా సూపర్‌డూపర్‌ హిట్‌.

టెంపర్‌ ఆడియో వేడుకలో నందమూరి కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ..నందమూరి అభిమానులు ఓ విషయాన్ని గమనించారో లేదో. అదేంటంటే పటాస్‌ మూడక్షరాలు. టెంపర్‌, లయన్‌ లు కూడా మూడక్షరాలే. పటాస్‌ ఇప్పటికే పేలింది. ఆ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ టెంపర్‌, లయన్‌లు కూడా బాగానే పేలుతాయని అన్నాడు. తన తమ్ముడు తారక్‌ ఎంతో కష్టపడి నటించిన టెంపర్‌ను హిట్‌ చేసి అతన్ని ఓ రేంజ్‌లో నిలబెట్టాలని ఫ్యాన్స్‌ను కోరాడు.

ఆడియో విడుదల కార్యక్రమంలో సినిమా దర్శకుడు పూరీ జగన్నాధ్‌ మాట్లాడుతూ..11ఏళ్ల కిందట మా ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆంధ్రావాలా’ చాలా నిరుత్సాహపరిచింది. ఫ్యాన్స్‌ కూడా నన్ను బాగా తిట్టుకున్నారు. అయితే నందమూరి ఫ్యాన్స్‌కి ఇప్పుడు ఒకటే చెబుతున్నాను. మా టెంపర్‌ సినిమా చూశాక మాత్రం గత 11ఏళ్లలో కనిపించిన ఎన్టీఆర్‌ను మీరు మర్చిపోతారు. ఎన్టీఆర్‌ ఫర్‌ఫామెన్స్‌ ఇందులో అలా ఉంటుంది. టెంపర్‌ తర్వాత కూడా తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు, సూపర్‌హిట్లు రావొచ్చు. ఎక్కువ డబ్బులు కలెక్ట్‌ చేయొచ్చు. అయితే టెంపర్‌ మాత్రం ఎన్టీఆర్‌ను శిఖరాన నిలబెడుతుంది. ఈ సినిమా ఇచ్చే రేంజ్‌ ఇప్పట్లో తగ్గదు అని పూరీ చెప్పుకొచ్చాడు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.