English | Telugu

బొమ్మాళీ.. నువ్వు సూప‌ర‌మ్మా..!

క‌థానాయిక‌ల్లో `హీరో`యిజం ఉట్టి ప‌డుతోంది. వాళ్లూ ఇప్పుడు రియ‌ల్ హీరోయిన్స్ అనిపించుకొంటున్నారు. స‌మంత ప్ర‌త్యూష ఫౌండేష‌న్ కోసం ధారాళంగా విరాళాలు సేక‌రిస్తోంది. హ‌న్సిక ముంబైలో అనాథాశ్ర‌మం నిర్మించ‌బోతోంది. త్రిష మూగ జీవాల కోసం పాటు ప‌డుతోంది. ఇప్పుడు అనుష్క మ‌రో మార్గంలో సేవ చేస్తోంది. సినీ రంగంలో అనుష్క‌ది దాదాపు ప‌దేళ్ల ప్ర‌స్థానం. తెలుగు, త‌మిళ చిత్ర రంగాల్లో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. అత్య‌ధిక పారితోషికం అందుకొనే క‌థానాయికల జాబితాలో చేరింది. తాను ఈ స్థాయికి వ‌చ్చిందంటే.. వెనుక త‌న‌ని ప‌దేళ్లుగా అంటిపెట్టుకొన్న సిబ్బంది కూడా కార‌ణ‌మేఅని అనుష్క భావిస్తోంది. అందుకే వాళ్ల‌కు ఇతోదికంగా స‌హాయం చేయాల‌ని నిర్ణ‌యించుకొంద‌ట‌. అందుకే ఇప్పుడు హైద‌రాబాద్లో ఓ స్థ‌లం కొనుగోలు చేసింది. అక్క‌డ ఓ అపార్ట్‌మెంట్ నిర్మించ‌బోతోంద‌ట‌. అందులోని ఫ్లాట్‌ల‌ను త‌న ద‌గ్గ‌ర పదేళ్లుగా క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తున్న సిబ్బందికి కేటాయించ‌బోతోంద‌ని, వాళ్ల‌కు కానుక‌గా అందిస్తుంద‌ని టాక్‌. రుద్ర‌మ‌దేవి, బాహుబ‌లితో పాటు త‌న చేతిలో ఉన్న సినిమాల్ని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి పెళ్లిచేకొని లైఫ్‌లో స్థిర‌ప‌డిపోవాల‌ని అనుష్క నిర్ణ‌యించుకొంద‌ని స‌మాచార‌మ్‌. పెళ్లి చేసుకొని సినిమాల‌కు గుడ్‌బై చెప్పాల‌ని భావిస్తోంద‌ట‌. ఈ లోగా ఈ అపార్ట్‌మెంట్ క‌ట్టి.. త‌న సిబ్బందికి కానుక‌గా ఇవ్వాలనుకొంటోంది. ఇంత మంచి ప‌ని చేస్తున్న జేజ‌మ్మ‌ని అభినందించ‌కుండా ఎలా ఉంటాం.. బొమ్మాళీ నువ్వు సూప‌ర‌మ్మా..!

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.