English | Telugu
‘తెలుగువన్’ షార్ట్ ఫిలిం వర్క్‌షాప్ గ్రాండ్ సక్సెస్..
Updated : Sep 13, 2014
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మంచి మంచి షార్ట్ ఫిలిమ్స్ రావడానికి తనవంతు సహకారాన్ని అందిస్తున్న ‘తెలుగువన్’ శనివారం హైదరాబాద్‌లోని లమకాన్‌లో నిర్వహించిన షార్ట్ ఫిలిం వర్క్‌షాప్‌కి ఔత్సాహిక షార్ట్ ఫిలిం మేకర్ల నుంచి మంచి ప్రతిస్పందన, ప్రశంసలు లభించాయి. మొత్తం 160 మంది ఔత్సాహిక షార్ట్ ఫిలిం మేకర్లు ఈ వర్క్ షాప్‌లో పాల్గొన్నారు.
ఈ వర్క్‌షాప్‌లో ప్రముఖ తెలుగు నటుడు, రచయిత, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ అతిథిగా పాల్గొన్నారు. ఔత్సాహికులకు సలహాలు, సూచనలు ఇవ్వడంతోపాటు సినిమా, షార్ట్ ఫిలిం మేకింగ్‌కి సంబంధించి తన ఆలోచనలు, అనుభవాలు పంచుకున్నారు. ఫిలిం మేకింగ్ దశలను, అనుకున్న కథను పూర్తి స్క్రిప్ట్‌గా రూపొందించడంలో మెళకువలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. అలాగే పలు ప్రఖ్యాత సినిమాల స్క్రీన్ ప్లేని ఉదహరించారు. ఇలాంటి వర్క్‌షాప్‌లను ఏర్పాటు చేస్తూ ఔత్సాహికులైన షార్ట్ ఫిలిం మేకర్లను ప్రోత్సహిస్తున్న ‘తెలుగువన్’ని ఆయన ఈ సందర్భంగా అభినందించారు.
ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్న ఔత్సాహికులు వర్క్‌షాప్‌కు హాజరు కావడం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నెల తర్వాత జరిగే మరో వర్క్‌షాప్‌లో పాల్గొనాలన్న ఆకాంక్షను వారు వ్యక్తం చేశారు. ‘తెలుగువన్’కి ఈసందర్భంగా వారందరూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.