English | Telugu

బెల్లంకొండ సురేష్ అతితెలివి

బెల్లంకొండ సురేష్ అతితెలివి చూపించాడని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే ఇటీవల శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై, యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా, సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో, బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న "హరహర మహాదేవ" సినిమా హీరో బాలయ్య జన్మదినం సందర్భంగా ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి వెళ్ళిన వారికి అక్కడ బాలకృష్ణ తలని ఫొటోషాప్ లో వేరేవారి శరీరానికి తగిలించిన ఫొటోలు దర్శనమివ్వటం ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులకు కడుపు మండించిందని చెప్పాలి.

వాటిలో ఒకటి "దశావతారం" సినిమాలో కమల్ హాసన్ శరీరానికి బాలకృష్ణ తలని ఫొటో షాప్ లో తగిలించారు. అలాగే మమ్ముట్టి మళయాళంలో నటించిన "పళాసి రాజా" సినిమాలోని మమ్ముట్టి గుర్రం మీద స్టిల్ తిసుకుని ఆ శరిరానికి ఫొటో షాప్ లో బాలకృష్ణ తలని అతికించారు. ఇది ఆ ఫొటోలను చూసిన పసిపిల్లలకు కుడా అర్థమవుతుంటే ఆ చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ మాత్రం "అబ్బెబ్బె అవి ఫొటోషాప్ లో చేసినవి కాదండీ. బాలయ్య బాబుతో మేం ఫొటో షూట్ చేసిన ఫొటోలు" అని అడ్డంగా బొంకుతున్నాడట. ప్రేక్షకులకు ఫొటో షాప్ కీ ఫొటో షూట్ కీ తేడా తెలియదని పాపం బేల్లంకొండ అభిప్రాయం కాబోలు. మేమిచ్చే ఫొటోలు చూస్తే ఏది నిజమో మీకే తెలుస్తుంది.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.