English | Telugu

పార్టీలో మన హీరోలూ, హీరోయిన్లు

పార్టీలో మన హీరోలూ, హీరోయిన్లు చాలా హుషారుగా పాల్గొంటారు. అదే బయట హోటల్స్ లో అయితే ఏమన్నా కాస్త మొహమాటపడతారేమో కానీ, తమ తమ ఇళ్ళల్లో జరుపుకునే ప్రైవేట్ పార్టీల్లో ఇక వారికి పట్టపగ్గాలుండవు కదా... అలాంటి పార్టీ ఒకటి ఈ మధ్య జరిగింది. ఈ పార్టీలో ప్రిన్స్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యువ హీరో దగ్గుబాటి రానా, రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కుమార్, త్రిష, కాబోయే మెగా నిర్మాత అల్లు శిరీష్ తదితరులు పాల్గొన్నారు. ఇక వారి జోరుకి అడ్డే లేకుండా పోయింది. ఆ పార్టీలోని కొన్ని ఫొటోలు మా తెలుగు వన్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం. చూసి ఆనందించండి.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.