English | Telugu

యన్ టి ఆర్, అల్లు అర్జున్ లకు భార్యల వల్ల కలసి రాలేదా...?

యన్ టి ఆర్, అల్లు అర్జున్ లకు భార్యల వల్ల కలసి రాలేదా...? అంటే అవును కలసి రాలేదనే అంటున్నారు ఫిలిం నగర్ జనాలు. అదేమంటే "బిడ్డొచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ" అనే సామెతను గుర్తు చేస్తున్నారు వారు. వివరాల్లోకి వెళితే మన తెలుగు యువ హీరోలు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ యన్ టి ఆర్ లు ఇద్దరూ ఇటీవల వివాహం చేసుకున్నారు. అల్లు అర్జున్ తను ప్రేమించిన స్నేహారెడ్డిని ఇరువర్గాల పెద్దల అంగీకారంతో ఘనంగా పెళ్ళి చేసుకున్నాడు. అలాగే యన్ టి ఆర్ కూడా లక్ష్మీ ప్రణతిని పెద్దలు కుదిర్చిన సంబంధంగా పెళ్ళి చేసుకున్నాడు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న అనంతరం విడుదలైన సినిమాలు రెండూ కూడా ఘోరంగా ఫ్లాపయ్యాయి.

అంటే పెళ్ళవగానే యన్ టి ఆర్ హీరోగా నలక నడుము గోవా సుందరి ఇలియానా హీరోయిన్ గా, మెహెర్ రమేష్‍ దర్శకత్వంలో, అశ్వనిదత్ నిర్మించగా విడుదలైన "శక్తి" ఫ్లాపయ్యింది. అలాగే పెళ్ళి చేసుకున్న తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించిన "బద్రీనాథ్" చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాపయ్యింది. దీన్ని బట్టి ఈ యువ హీరోల భార్యలు వీరి జీవితంలోకి అడుగుపెట్టిన వేళావిశేషం అంత బాగా లేదంటున్నారు ఫిలిం నగర్ వర్గాలు. ఒక సనిమా హిట్టవగానే అమ్మాయి పాదం మంచిదనీ, ఒక సినిమా ఫ్లాపవగానే అమ్మాయి పాదం చెడ్డదనీ నిర్ణయించటం అంత మంచి సాంప్రదాయం కాదు అనేది సినీ పెద్దలంటున్నారు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.