English | Telugu

యూరప్ లో దడ టీమ్

యూరప్ లో "దడ" టీమ్ పర్యటిస్తూంది. వివరాల్లోకి వెళితే కామాక్షీ కళా మూవీస్ పతాకంపై, యువహీరో నాగచైతన్య హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, అజయ్ భూయాన్ అనే యువకుణ్ణి దర్శకుడిగా పరిచయం చేస్తూ, ప్రముఖ నిర్మాత డి.శివప్రసాద రెడ్డి నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం "దడ". గతంలో "రోజాపూలు, పోలీస్ పోలీస్, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే" వంటి సినిమాల్లో నటించిన తమిళ హీరో శ్రీరామ్ ఈ "దడ" సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

ఈ "దడ" చిత్రం యూనిట్ ప్రస్తుతం యురప్ లో ఈ సినిమా తాలూకు ముఖ్యమైన సీన్లనూ, కొన్ని పాటలనూ చిత్రీకరించటానికి యూరప్ పర్యటిస్తూంది."దడ" సినిమాకి యువసంగీత తరంగం దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్నందిస్తున్నారు. "బొమ్మరిల్లు" ఫేం అబ్బూరి రవి ఈ "దడ" చిత్రానికి సంభాషణలు వ్రాస్తున్నారు. జూన్ నెలాఖరుకల్లా ఈ "దడ" సినిమా ఆడియోని విడుదల చేసి, "దడ" సినిమాని ఆగస్టులో విడుదల చేయటానికి ఈ చిత్ర నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.