English | Telugu

‘రావు బహదూర్‌’ టీజర్‌ రిలీజైంది... అసలు ఇది ఏ జోనర్‌ సినిమా?

కేరాఫ్‌ కంచరపాలెం వంటి వైవిధ్యమైన సినిమాతో దర్శకుడుగా పరిచయమైన వెంకటేష్‌ మహా తొలి సినిమాతోనే ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత సత్యదేవ్‌ ప్రధాన పాత్రలో మరో విభిన్నం చిత్రంగా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వచ్చింది. అయితే ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్‌ అయింది. దాదాపు 5 సంవత్సరాల గ్యాప్‌ తర్వాత ‘రావు బహదూర్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు వెంకటేష్‌. ఈ సినిమాలో కూడా సత్యదేవ్‌నే హీరోగా తీసుకున్నారు. జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీచక్రాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌ బేనర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ అందర్నీ ఆకట్టుకుంది. సత్యదేవ్‌ని గుర్తుపట్టలేని విధంగా అతని గెటప్‌ని క్రియేట్‌ చేశారు వెంకటేష్‌.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. పూర్తి విభిన్నంగా ఈ సినిమా ఉండబోతోందని టీజర్‌ చూస్తే అర్థమవుతుంది. ఇది ఏ జోనర్‌ సినిమా అనేది కూడా అర్థం కాని విధంగా టీజర్‌ ఉంది. ఈ టీజర్‌ను ఎస్‌.ఎస్‌.రాజమౌళి విడుదల చేశారు. ఈ టీజర్‌లో మొదట వినిపించే డైలాగ్‌ నాకు అనుమానం అనే భూతం పట్టిందంటూ చెప్పే డైలాగ్‌తో టీజర్‌ మొదలవుతుంది. ఇది ఒక సైకలాజికల్‌ డ్రామా అనే విషయం టీజర్‌లో చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సినిమాలో సత్యదేవ్‌ రకరకాల గెటప్స్‌లో కనిపించబోతున్నాడు. ఇందులో మర్డర్స్‌ మిస్టరీ కూడా ఉంది. ఓవరాల్‌గా ఈ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని కలిగించేలా కనిపిస్తోంది. ప్రేక్షకులకు ఒక డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌నివ్వాలనే ఆలోచనతో వెంకటేష్‌ మహా చేసిన ‘రావు బహదూర్‌’ సత్యదేవ్‌ కెరీర్‌లో మరో డిఫరెంట్‌ మూవీ కాబోతోంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.