English | Telugu

అక్టోబర్‌  రెండో వారంలో ‘పోయే ఏనుగు పోయే’ 

బాహుబలి ప్రభాకర్‌ ప్రధాన పాత్రలో కె.శరవణన్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పోయే ఏనుగు పోయే’. భీమ్స్‌ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే విడుదలై యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌ రాబట్టుకుని సినిమాపై అంచనాలు పెంచాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ పాన్‌ ఇండియా చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్‌ రెండో వారంలో గ్రాండ్‌గా విడుదలవుతోంది.

ఈ సందర్భంగా దర్శక నిర్మాత కె.శరవణన్‌ మాట్లాడుతూ...‘పోయే ఏనుగు పోయే’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చే నెల 9న విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన పాటలకు, టీజర్‌, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. బాహుబలి ప్రభాకర్‌ పాత్ర సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. కొంత మంది నిధిని దక్కించుకోవడానికి ఒక ఏనుగు పిల్లని బలి ఇవ్వాలనుకుంటారు. దాన్ని ఒక కుర్రాడు ఎలా ఆపాడు? ఆ ఏనుగు పిల్లను తల్లి దగ్గరకు ఎలా చేర్చాడు అన్నది కథాంశం. ప్రతి సీన్‌ అడ్వెంచరస్‌గా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ధన్‌రాజ్‌, రఘుబాబు, మనోబాల కీలక పాత్రల్లో నటించారు. అలాగే అద్భుతమైన గ్రాఫిక్స్‌తో విజువల్‌ వండర్‌గా సినిమాను తీర్చిదిద్దాము’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియోబీ సినిమాటోగ్రఫీ: అశోక్‌ రెడ్డి.కెబీ, నిర్మాత-రచన-దర్శకత్వం: కె.యస్‌.నాయక్‌.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.