English | Telugu

ఇక కుటుంబ కథా చిత్రాలకి మంగళం పాడినట్లేనా!

సినిమా అనే అందమైన ప్రపంచాన్నిప్రేక్షకులకి దగ్గరగా చేసిన చిత్రాలు ఏవి అంటే కుటుంబ కథా చిత్రాలు అని చెప్పవచ్చు. ఒక రకంగా సినిమా పుట్టుక కూడా కుటుంబ కథా చిత్రాలతోనే ప్రారంభమైంది. ఇందుకు తెలుగు సినిమా మినహాయింపు కాదు. తెలుగు సినిమా(Telugu cinema)ప్రారంభం నుండి కుటుంబ కథా చిత్రాలే రాజ్యమేలాయి. ఆ తర్వాత నూతన ఒరవడులతో అనేక జోనర్స్ వచ్చాయి. కానీ కుటుంబ కథా చిత్రాల రాక మాత్రం ఆగలేదు. అగ్ర హీరోలు సైతం ఎన్ని కమర్షియల్ చిత్రాలు చేసినా, ఫ్యామిలీ చిత్రాలని మాత్రం వదల్లేదు. ఒక రకంగా ఆ చిత్రాలు ఎంత పెద్ద హీరో అయినా,తన సినీ జర్నీకి శ్రీరామరక్ష గా ఉండేవి. అంతటి శక్తి కుటుంబ కథా చిత్రాల సొంతం.

కానీ రాను రాను ఫ్యామిలీ చిత్రాలు తగ్గడం ప్రారంభమైంది. ఇంచు మించు దశాబ్దం క్రితం నుంచి అయితే వాటి ఊసే లేదు. మధ్యలో అలాంటి ఛాయలతో ఉన్న కొన్ని చిత్రాలు వచ్చినా, సదరు చిత్రాల్లో ఇతర జోనర్స్ కి కూడా మిక్స్ చేసారు. అయినా కుటుంబ కదా చిత్రాలంటే అన్నదమ్ములు, భార్య భర్తలు, తోడికోడళ్లు, అన్నా చెల్లెలు, అక్కాచెల్లెళ్లు, దాయాదుల మధ్య అన్యోన్యత, కలహాలు,ఆ బంధాల మధ్య చిచ్చు పెట్టే విలన్, కథని మలుపు తిప్పే క్యారక్టర్ ఆర్టిస్టులు. కామెడి నటులు చేసే అల్లరి, అందమైన పాటలు, ఇలాంటి అంశాలతో పర్ఫెక్ట్ విందు భోజనం లాగా కుటుంబ కథా చిత్రం ఉండేది. ప్రతి ఒక్క సన్నివేశంతో పాటు, నటీనటుల పెర్ ఫార్మెన్సు చూస్తుంటే మన కళ్ళు ఎంత భాగ్యం చేసుకున్నాయో కూడా అనిపించక మానదు. నేటికీ ఆ చిత్రాలని యూట్యూబ్ లో చూసి మురిసిపోయే వారు ఎంతో మంది ఉన్నారు.

ఇక ఫ్యామిలీ చిత్రాలు చూడాలంటే యూట్యూబ్ నే పర్మినెంట్ వేదిక కాబోతుందేమో అనే సందేహాలు సినీ ప్రేమికులతో పాటు విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతుంది. ప్రస్తుత పాన్ ఇండియా పరిస్థితుల్లో మేకర్స్ నుంచి ఫ్యామిలీ చిత్రాలు ఆశించడం అత్యాశే. అసలు ఆ ఆలోచన మేకర్స్ కి గాని నటులకి గాని ఉందని అనుకోవడం కూడా పొరపాటే అవుతుంది. విజువల్స్ పరంగా, సాంకేతిక పరంగా ఎంత హై బడ్జెట్ తో తెరకెక్కించినా, ప్రస్తుతం వాటి ఎస్పైర్ డేట్ కొన్ని రోజులే అనేది మాత్రం నిజం. ఇందుకు సాక్ష్యం యూ ట్యూబ్(You Tube)లో ఓల్డ్ ఫ్యామిలీ మూవీస్ కి వస్తున్న వ్యూస్ నే ఉదాహరణ.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.