English | Telugu
అక్కడ జననాయగన్ సినిమాపై నిషేధం!... ఆ హీరో అభిమానులు హ్యాపీ
Updated : Jan 7, 2026
-విజయ్ ఫ్యాన్స్ కి షాక్
-అక్కడ నిషేధించడం కలెక్షన్స్ పై ప్రభావం చూపిస్తుందా!
-అసలు నిషేధం వార్తలు నిజమేనా!
వరల్డ్ వైడ్ గా ఇళయదళపతి 'విజయ్'(VIjay)అభిమానుల సందడి 'జననాయగన్'(Jananayagan)ద్వారా మరోమారు కొనసాగుతుంది. ప్రత్యక్షరాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ ప్రజలకి సేవ చేయడానికి జన నాయగన్ తో సినిమాలకి గుడ్ బై చెప్తుండటం, పైగా మూవీలో రాజకీయ సువాసనలు పెద్ద ఎత్తున ఉండటంతో జన నాయగాన్ టార్గెట్ ఏ విధంగా ఉండబోతోందనే ఆసక్తి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా నెలకొని ఉంది. కానీ జననాయగాన్ రిలీజ్ తమ దేశంలో ఆగిందనే న్యూస్ ఒకటి వినిపిస్తుండటంతో ఆ దేశ అభిమానులు షాక్ కి గురవుతున్నారు.
విజయ్ సినిమాలు సుదీర్ఘ కాలం నుంచి ఇండియాతో పాటు అమెరికా, మలేషియా, సింగపూర్, గల్ఫ్ దేశాలలో రిలీజ్ అవుతు ఉంటాయి. ఆయా దేశాల్లో అభిమాన గణం కూడా ఎక్కువే. కానీ జననాయగాన్ ని గల్ఫ్ కంట్రీ సౌదీ అరేబియాలో నిషేధం విధించినట్లుగా తెలుస్తోంది. పాకిస్తాన్ దేశంతో పాటు ఏదైనా ముస్లిం దేశానికి వ్యతిరేకంగా ఉండే సినిమాలని,లేదా ఇస్లాంని విమర్శించే సినిమాలని సౌదీ అరేబియా నిషేధిస్తుంది. ఇప్పుడు 'జన నాయగన్’సినిమాపై నిషేధం విధించడానికి ఇదే కారణమని చెబుతున్నారు.'జన నాయగన్’ లో విలన్ పాకిస్థాన్ వ్యక్తి. పాకిస్తాన్ తో పాటు పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా కొన్ని సంభాషణలు, సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఈ విషయం ట్రైలర్ ద్వారా స్పష్టంగా అర్ధమవుతుంది.
also read: చిరంజీవితో ఐశ్వర్యా రాయ్ జత కట్టిందా!.. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి
సెన్సార్ ని కూడా సౌదీ అరేబియా ప్రభుత్వం నిరాకరించింది. ఇటీవల విడుదలైన బ్లాక్ బస్టర్ చిత్రం 'ధురంధర్’(Dhurandhar)ని పాకిస్థాన్ కి వ్యతిరేకంగా ఉందని రిలీజ్ నిషేదించిన విషయం తెలిసిందే. ఇక జన నాయగాన్ కి తమిళనాడులో సెన్సార్ టాక్ బ్లాక్ బస్టర్ అని వస్తున్నట్టుగా తమిళ సినీ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.