English | Telugu

థియేటర్‌కి వెళ్లి మరి అగ్ర హీరో మూవీ చూసిన టీమిండియా క్రికెటర్లు.. ఫ్యాన్స్ హంగామా 

-ఫ్యాన్స్ సంబరాలు
-ఇంతకీ ఆ సినిమా ఏంటి
-కలెక్షన్స్ లో సంచనాలు


కళ రూపంలో మన ముందున్న సినిమా అనేది ఎంత గొప్పదో చెప్పాలంటే కొన్నియుగాలు అయినా సరిపోవు. ఎన్నో టెన్షన్స్ నుంచి మనుషులని దూరం చేస్తు సంపూర్ణ ఆయుష్షుని కలిగించేలా ఆనందాన్ని, హాయిని, హాస్యాన్ని ఇవ్వడంలో ముందు వరుసలో ఉంటుంది అసలు దేవుడే మంచి సినిమా వస్తే మారువేషంలో థియేటర్ కి వచ్చి చూస్తాడనే నానుడి కూడా సినీ ప్రేమికుల్లో ఉంది. అంత శక్తివంతమైనది సినిమా. అంత శక్తివంతమైనది కాబట్టే ఇండియన్ క్రికెట్ టీం తమ షెడ్యూల్స్ తో బిజీగా ఉన్నా దురంధర్ ని థియేటర్ కి వెళ్లి మరి వీక్షించడం జరిగింది.


ఈ రోజు దక్షిణాఫ్రికాతో జరగబోయే నాలుగో టీ20 మ్యాచ్ కోసం ఆటగాళ్లు 'లక్నో' చేరుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం లక్నోలోని ఒక మల్టీప్లెక్స్‌లో దురంధర్ ని చూడటానికి వెళ్లారు. రాత్రి ఏమిదిగంటల పది నిమిషాల షో కి టికెట్స్ బుక్ చేసుకొని మరి వెళ్లడం విశేషం. మూవీ పూర్తయ్యేసరికి అర్ధరాత్రి 12.10 అయింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్, వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, అర్ష్‌దీప్ సింగ్ తదితర క్రికెటర్లు ధరంధర్ ని చూసిన వాళ్ళల్లో ఉన్నారు. భద్రతా దృష్ట్యా టీం ఇండియా ఆటగాళ్లు, సిబ్బందిని తప్ప మరెవరినీ ఈ స్క్రీనింగ్‌లోకి అనుమతించలేదు. ఆటగాళ్ల భద్రత మరియు సౌలభ్యం కోసం మొత్తం థియేటర్ బుక్ చేశారని మల్టీ ప్లెక్స్ నిర్వాహకులు తెలిపారు.


also read:అవతార్ ఫైర్ అండ్ యాష్ కి షాకింగ్ రివ్యూస్.. ఇచ్చిన సంస్థలు ఇవే


ఇక దురంధర్ పాన్ ఇండియా వ్యాప్తంగా తన హవాని మరింత పెంచుకుంది.తెలుగులో కూడా పెద్ద ఎత్తున కలెక్షన్స్ రాబడుతు ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. 400 కోట్ల రూపాయలకి చేరువలో ఉంది. ఉగ్రవాద దాడులతో ఇండియాలో అస్తిత్వం సృషించడానికి పాకిస్థాన్ కి చెందిన అరాచక శక్తీ రెహ్మాన్ డెకాయిట్(అక్షయ్ ఖన్నా) ప్రయత్నిస్తుంటాడు. దీంతో జస్కి రత్ సింగ్(రణవీర్ సింగ్) అనే ఇండియన్ రా ఏజెంట్ హంజా మజారి గా రెహ్మాన్ డెకాయిట్ దగ్గరే పనిలో చేరతాడు. ఈ సందర్భంగా వచ్చే కథనాలు,నటీనటుల పెర్ ఫార్మెన్స్, క్లైమాక్స్, ఆదిత్య దర్ దర్శకత్వ ప్రతిభ మంత్ర ముగ్దుల్ని చేస్తాయి.


టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.