English | Telugu
తమన్నా ఓజంపిక్ ఇంజెక్షన్స్ వాడుతోందా!
Updated : Nov 11, 2025
-తమన్నా పై ఆరోపణలు
-వివరణ ఇచ్చిన తమన్నా
-మహిళల్లో ప్రతి ఐదేళ్లకి మార్పులు
-అప్ కమింగ్ మూవీస్ ఇవే
పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై స్టార్ నటీమణి 'తమన్నా'(Tamannaah Bhatia)కి ఉన్న చరిష్మా మరో నటీమణికి లేదంటే అతిశయోక్తి కాదు. 2005 లో సినీ రంగ ప్రవేశం చేసి రెండున్నర దశాబ్దాల నుంచి తన హవా కొనసాగించడం అంటే అతిశయోక్తి కాదు. ఇందుకు అభిమానులని, ప్రేక్షకులని ఆకట్టుకునే గ్లామర్ చాలా ముఖ్యం. పైగా హీరోయిన్ గా ఎంత పాపులారిటీ ని సంపాదించిందో, ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్ లోను అంతే పాపులారిటీ ని సంపాదించింది. పైగా తమన్నా స్పెషల్ సాంగ్ ఉందంటే చాలు ఆ సినిమాకి ప్రేక్షకులు అభిమానులు క్యూ కడుతున్నారు. బడా హీరోలు, మేకర్స్ సైతం తమ సినిమాలో 'తమన్నా' సాంగ్ ఉండాలని కూడా కోరుకుంటున్నారంటే తమన్నా బ్రాండ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.
కొంత కాలం నుంచి తమన్నా ఒంటి తీరుపై సోషల్ మీడియా వేదికగా చాలా రూమర్స్ వస్తున్నాయి. బరువు తగ్గేందుకు తమన్నా 'ఓజంపిక్'(ozempic)లాంటి ఇంజెక్షన్స్ తీసుకుంటుందనేది సదరు సారాంశం. ఈ వార్తలపై రీసెంట్ గా తమన్నా ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తు పదిహేను సంవత్సరాల వయసు నుంచి కెమెరా ముందు నటిస్తున్నాను. కాబట్టి నేను దాచడానికి ఏమి లేదు. కెమెరా తోనే నా ప్రయాణం కొనసాగుతుంది.టీనేజ్ లో స్లిమ్ గా ఉన్నాను. ఇప్పుడు అలాగే ఉండాలని అనుకుంటున్నాను. అంతే గాని ఇందులో దాచడానికి ఏం లేదు. పైగా నాకు నేను కొత్తగా కనిపించడం లేదు. సాధారణంగా మహిళల్లో ప్రతి ఐదేళ్లకి మార్పులు చోటు చేసుకుంటాయి. కాబట్టి ఎప్పుడు ఒకే శరీరాకృతిలో కనిపించలేమని చెప్పుకొచ్చింది.
Also Read:బెల్లంకొండ సురేష్ పై కబ్జా ఆరోపణలు!..ఫిల్మ్‌నగర్‌లో కేసు నమోదు
ప్రస్తుతం తమన్నాలిస్ట్ లో ఓ రోమియో రేంజర్, వ్యాన్, రాగిణి ఎంఎస్ఎస్ 3 తో పాటు మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. తమన్నా ఇటీవల బెట్టింపుల యాప్ కి సంబంధించి ప్రమోషన్ చేసిన కేసులో ఇరుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.