English | Telugu
కొత్త పార్లమెంట్ భవనంలో తమన్నా సందడి!
Updated : Sep 21, 2023
ఇటీవల కొత్త పార్లమెంట్ భవనంలో ఎంతో కాలంగా పెండిరగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభ ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రముఖులైన మహిళలు సందర్శించారు. బాలీవుడ్ హీరోయిన్లు భూమిపెడ్నేకర్, షెహనాజ్ గిల్, దివ్యదత్తా, క్రికెటర్ మిథాలి రాజ్, బాక్సర్ మేరీకోమ్, హాకీ క్రీడాకారిణి రాణి రామ్‌పాల్, పారాఒలింపిక్ అథ్లెట్ దీపా మెహతా కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించినవారిలో ఉన్నారు. వీరితోపాటు ఖుష్ బూ, మంచు లక్ష్మి పాల్గొన్నారు. అక్కడ మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
పార్లమెంట్ భవనం ప్రధాన ద్వారం వద్ద మీడియాతో మాట్లాడారు తమన్నా. మహిళా రిజర్వేషన్ బిల్లు వల్ల సామాన్యులు సైతం రాజకీయాల్లోకి రావడానికి ఎంతో ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. నటి దివ్యా దత్తా మాట్లాడుతూ మహిళా బిల్లుపై కేంద్రం చూపించిన చొరవ అభినందనీయమని, ప్రతి అంశంలో మహిళలకు ప్రాధాన్యం పెరుగుతుందని అన్నారు.