English | Telugu

మ‌ర్డ‌ర్ కేస్‌లో చిక్కుకున్న ట‌బు

ఢిల్లీలో డాక్ట‌ర్ల కుటుంబం. త‌ల్లీదండ్రీ ఇద్ద‌రూ వైద్యులే. కుమార్తె కూడా అదే దారిలో డాక్ట‌ర్ అవుదామ‌నుకొంది. కానీ హ‌ఠాత్తుగా ఆమెను ఎవ‌రో హ‌త్య చేశారు. పోలీసుల‌కు ఆ ఇంటి ప‌నిమ‌నిషిపై అనుమానం వ‌చ్చింది. తెల్లారే స‌రికి ఆ ప‌ని మ‌నిషీ హ‌త్య‌కు గురయ్యాడు. పోలీసుల‌కు చిక్కిన ఒకే ఒక్క క్లూ.. మాయ‌మైన‌ట్టైంది. మ‌రో క్లూ అన్వేషించ‌డానికి ఏడాది ప‌ట్టింది. పోలీసుల గురి మ‌రొక‌రిపై ప‌డేస‌రికి.. అత‌న్నీ ఎవ‌రో చంపేశారు. దాంతో పోలీస్ డిపార్ట్‌మెంట్ మొత్తం షాక్ తింది. ఒక్క క్లూ కూడా దొరక్కుండా హ‌త్య‌లు చేసిందెవ‌రో తేల్చుకోవ‌డానికి వాళ్ల‌కు సంవ‌త్స‌రాలు ప‌ట్టింది. చివ‌రికి ఈ హ‌త్య‌లు ఎవ‌రు చేశారు? ఎందుకు ? ప‌దేళ్ల‌యినా పోలీసుల‌కు ఈ కేసు అంతు చిక్క‌లేదు. ఇది క‌థ కాదు. నిజం. ఢిల్లీలో సంచ‌లంన సృష్టించిన ఆర్సీ త‌ల్వార్ కేసు ఉదంతం ఇది. ఇప్పుడు ఈ మిస్ట‌రీని మ‌ర్డ‌ర్స్‌ని సినిమాగా తీస్తున్నారు. ట‌బు ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. విశాల్ భ‌ర‌ద్వాజ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. ఇలాంటి మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ చిత్రాల్లో న‌టించ‌డం ఇదే తొలిసార‌ని ట‌బు చెబుతోంది. పోలీల‌కు అంతు తేలి త‌ల‌నొప్పిగా మారిన ఈ కేసు... ప్రేక్ష‌కుల‌కు ఇంకెంత థ్రిల్లింగ్ క‌లిగిస్తుందో మ‌రి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.