English | Telugu

ప‌వ‌న్ ఫ్యాన్స్ కి షాకిచ్చిన షారుఖ్‌

అత్తారింటికి దారేది... టాలీవుడ్‌లో స‌రికొత్త రికార్డుల‌ను సృష్టించిన సినిమా. ఆల్ టైమ్ రికార్డ్స్ అన్నీ... ఈ సినిమా పేరుమీదే ఉన్నాయి. బాలీవుడ్‌లో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తార‌ని, షారుఖ్ ఖాన్ అందులో క‌థానాయ‌కుడిగా న‌టిస్తార‌ని వార్త‌లొచ్చాయి. షారుఖ్ ఈ సినిమాని చూశార‌ని, ప‌వ‌న్ పాత్ర విప‌రీతంగా న‌చ్చి - ఈ సినిమా చేయ‌డానికి ఒకే చెప్పాడ‌ని చెప్పుకొన్నారు. అయితే అదంతా ఉత్తుత్తినేన‌ట‌. అస‌లు అత్తారింటికి దారేది సినిమాని షారుఖ్ చూడ‌లేద‌ట‌. ఇక రీమేక్ ప్ర‌స్తావ‌న ఎందుకొస్తుంది.?? ''అత్తారింటికి దారేది సినిమాని నేనేం రీమేక్ చేయ‌డం లేదు. అస‌లు ఆ సినిమా చూళ్లేదు. నిజానికి గ‌త కొంత కాలంగా ద‌క్షిణాది సినిమాల్ని చూడ‌డం లేదు'' అని షారుఖ్ ఓ ఇంట‌ర్వ్యూలో బ‌య‌ట‌పెట్టాడు. సో... ప‌వన్ సినిమాని షారుఖ్ రీమేక్ చేస్తాడ‌ని చెప్ప‌డం క‌ట్టుక‌థే అన్న‌మాట‌.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.