English | Telugu

అది నేను కాదంటున్న హాట్ బ్యూటీ

అందాల హాట్ బ్యూటీ, హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ ఇటీవలే ఓ టీవీ ఛానెల్ స్టింగ్ ఆపరేషన్‌లో వ్యభిచారం చేస్తూ దొరికిపోయిందని వార్తలు వచ్చాయి. మూడు గంటలకు మూడులక్షల చొప్పున విటుల నుంచి వసూలు చేస్తోందని, రాజకీయ నాయకులైతే 6 లక్షల వరకు తీసుకున్నట్లు ఆ ఛానెల్ వెల్లడించింది. అయితే ఇది జరిగి దాదాపు చాలా రోజులే అవుతుంది. ఇదంతా నిజమని అనుకున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద వార్త వచ్చినప్పటికీ కూడా శ్వేతా ఏ విధంగా కూడా స్పందించలేదు. అయితే తాజాగా ఈ విషయంపై శ్వేతా స్పందిస్తూ...ఆ వీడియోలో ఉన్నది తాను కాదని, వేరే ఎవరో మహిళను చూపిస్తూ ఆ ఛానెల్ అలా ప్రసారం చేసిందని ఆమె చెప్పుకొచ్చింది. అయినా వ్యవభిచారం చేయాల్సిన ఖర్మ తనకు పట్టలేదని.. డబ్బుల కోసం అలాంటి పనులు చేయనని సమర్థించుకుంది. ఈ విషయం ఇలా ఉంటే ఇది విన్నవాల్లందరూ కూడా "మరి అప్పుడే అసలు నిజం చెప్పొచ్చు కదా! ఇంతకాలం ఏం చేసారు. ఇలా చేస్తే పబ్లిసిటీ వస్తుందనా? లేక ఆ ఛానెల్ చెప్పిందే నిజమా? అని గుసగుసలు పెడుతున్నారు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.