English | Telugu
సుష్మితా సేన్ కి గుండెపోటు!
Updated : Mar 2, 2023
ఇటీవల ఎక్కువగా అందరూ గుండెపోటుకు గురవవుతున్నారు. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ఎందరో గుండెపోటు బారిన పడుతున్నారు. పలువురు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా సీనియర్ హీరోయిన్, మాజీ మిస్ వరల్డ్ సుష్మితా సేన్ గుండెపోటుకి గురయ్యారు. అయితే ఆమె సురక్షితంగా దాని నుంచి బయటపడ్డారు.
రెండు రోజుల క్రితం తనకు గుండెపోటు వచ్చినట్లు సుష్మితా సేన్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. కుటుంబ సభ్యులు సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లడంతో, వైద్యులు చికిత్స చేసి స్టెంట్ వేశారని, ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని సుష్మితా సేన్ పేర్కొన్నారు. సుష్మితా సేన్ క్షేమంగా ఉన్నారని తెలియడంతో సన్నిహితులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.