English | Telugu
శింబు ‘పత్తు తల’ టీజర్ అనౌన్స్‌మెంట్
Updated : Mar 2, 2023
పత్తు తల సినిమాకు సంబంధించిన టీజర్ న్యూస్‌ని ప్రకటించారు. కన్నడలో శివరాజ్‌కుమార్ నటించిన సినిమా మఫ్టి. ఇప్పుడు ఈ సినిమాను తమిళ్‌లో పత్తు తల పేరుతో రీమేక్ చేశారు. సిల్లున్ను ఒరు కాదల్, నెడుంజాలై సినిమాలను తెరకెక్కించిన కృష్ణ దర్శకత్వం వహించిన సినిమా పత్తు తలై. ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలో నటించారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూర్చారు. స్టూడియో గ్రీన్ తరఫున జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.
ఇటీవల శింబు పుట్టినరోజును పురస్కరించుకుని పత్తు తల సినిమా నుంచి నమ్మ సత్తం అంటూ సాగే లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు మేకర్స్. మార్చి 3 సాయంత్రం 5.31కి పత్తుతల టీజర్‌ని విడుదల చేయాలన్నది ప్లాన్. కామ్ బిఫోర్ ద స్టార్మ్ అంటూ ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు మేకర్స్. మార్చి 30 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది పత్తుతల. ఆ మధ్య వరుస ఫ్లాప్‌లు చూసిన శింబు, ఇప్పుడు కాస్త కెరీర్‌లో మళ్లీ గ్రిప్ తెచ్చుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ వెందు తనిందదు కాడు అనే సినిమా చేశారు శింబు. ఆ చిత్రానికి తమిళ్‌లో చాలా మంచి పేరు వచ్చింది. త్వరలోనే శింబుకి పెళ్లి అనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.
శ్రీలంకకు చెందిన అమ్మాయిని శింబుకి ఇచ్చి చేయాలన్నది పెద్దల నిర్ణయం. అమ్మాయిని చూసిన శింబు తనకు నచ్చిందని చెప్పడంతో పెద్దలు మిగిలిన ఏర్పాట్లు చేసుకుంటున్నారట. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు పాటలు కూడా పాడుతున్నారు శింబు. ఈ మధ్య పట్టుదలతో బరువు కూడా తగ్గారు. శింబు ఇప్పుడు చేసినట్టే జాగ్రత్తగా సినిమాలు ప్లాన్ చేసుకుంటే, మరో పదీ, పాతికేళ్లు కెరీర్‌కి తిరుగు ఉండదు అని అంటున్నారు ఫ్యాన్స్.