English | Telugu
క్రేజీ ఆఫర్ రిజెక్ట్ చేసిన అల్లు అర్జున్!
Updated : Mar 2, 2023
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న 'జవాన్' చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతిథి పాత్ర చేయబోతున్నట్లు ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే బన్నీని ఆ సినిమాలో అతిథి పాత్ర కోసం సంప్రదించడం నిజమే కానీ.. ఆయన ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
'పఠాన్' ఘన విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న షారుఖ్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో 'జవాన్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై పాన్ ఇండియా రేంజ్ లో మంచి క్రేజ్ ఉంది. ఇందులో సౌత్ స్టార్స్ నయనతార, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఇందులోని ఓ కీలకమైన అతిథి పాత్ర కోసం సౌత్ బిగ్ స్టార్ ని రంగంలోకి దింపాలని డైరెక్టర్ అట్లీ ప్రయత్నిస్తున్నాడు. మొదట కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ నటిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత అల్లు అర్జున్ పేరు తెరమీదకు వచ్చింది. ఇటీవల 'జవాన్' టీమ్ ప్రత్యేక పాత్ర కోసం అల్లు అర్జున్ ని సంప్రదించారట. ఇది 15 నిమిషాల నిడివి గల పాత్ర అని టాక్. అయితే 'పుష్ప-2'తో బిజీగా ఉన్న బన్నీ ప్రస్తుతం తన దృష్టంతా ఆ చిత్రం మీదే ఉండాలన్న ఉద్దేశంతో 'జవాన్' ఆఫర్ ని సున్నితంగా రిజెక్ట్ చేసినట్లు సమాచారం. దీంతో 'జవాన్' టీమ్ మరో సౌత్ స్టార్ ని వెతికే పనిలో పడిందట. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్లను సంప్రదించే అవకాశముందని అంటున్నారు.