English | Telugu

పవన్ కళ్యాణ్ తమ్ముడుగా సుశాంత్

పవన్ కళ్యాణ్ తమ్ముడుగా సుశాంత్ నటించనున్నాడట. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, హరీష్ శంకర్ దర్శకత్వంలో గణేష్ నిర్మించనున్న సినిమా "గబ్బర్ సింగ్". ఈ సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ సోదరుడి పాత్ర కోసం ముందుగా నితిన్, అజయ్, శ్రీకాంత్ ల పేర్లు వినిపించాయి. కానీ చివరికి ఆ పాత్రలో నటించే అదృష్టం సుశాంత్ కి దక్కిందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.

సుశాంత్ ప్రముఖ హీరో యువసామ్రాట్ అక్కినేని నాగార్జున సోదరి శ్రీమతి నాగసుశీల కుమారుడు...సుమంత్ కి తమ్ముడవుతాడు. సుశాంత్ ఒకటి, రెండు సినిమాల్లో నటించినా అవి ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవటంతో యువ హీరోగా కాస్త వెనకపడ్డాడనే చెప్పాలి. మరి ఈ "గబ్బర్ సింగ్" సినిమాలోని పవన్ కళ్యాణ్ తమ్ముడి పాత్రతో నటుడిగా అతని జాతకం మారుతుందేమో వేచి చూడాలి. "గబ్బర్ సింగ్" సినిమాలో పవన్ కళ్యాణ్ తల్లిదండ్రులుగా రెబెల్ స్టార్ కృష్ణం రాజు, సహజనటి జయసుధ నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నారు.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.