English | Telugu

రామ్ కందిరీగలో మూడు పాటలే బ్యాలెన్స్

రామ్ "కందిరీగ" లో మూడు పాటలే బ్యాలెన్స్ మిగిలాయని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై, చురుకైన యువహీరో రామ్ హీరోగా, హన్సిక మోత్వానీ హీరోయిన్ గా, కలర్స్ స్వాతి ఒక ముఖ్య పాత్రలో నటిస్తూండగా, శ్రియ ఐటమ్ సాంగ్ లో నర్తిస్తూండగా, సంతోష్ శ్రీనివాస్ అనే నూతన యువకుణ్ణి దర్శకుడిగా పర్తిచయం చేస్తూ, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ "కందిరీగ". రామ్ "కందిరీగ" సినిమా యూనిట్ నిజానికి జూన్ 13 వ తేదీన జర్మనీలో షూటింగ్ కి వెళ్ళాల్సి ఉంది.

కానీ జర్మనీలో "ఇ కోలి/ హజ్"అనే వైరస్ తో జర్మనీలో ప్రజల ఆరోగ్య పరిస్థతి ఆందోళనకరంగా ఉండటంతో, రామ్ "కందిరీగ" చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన చిత్రం యూనిట్ ని అక్కడకు పంపేందుకు విముఖంగా ఉన్నారు. ఆ వైరస్ ఎక్కడ తమ చిత్రం యూనిట్ కు సోకుతుందోనన్న భయంతో రామ్ "కందిరీగ" చిత్రం యూనిట్ జర్మనీ ట్రిప్ క్యాన్సిల్ అయ్యింది. మరి పాటల చిత్రీకరణకు వేరే ఏ లొకేషన్ చూస్తారో వేచి చూడాలి. రామ్ "కందిరీగ" సినిమాలో చిత్రీకరించటానికి కేవలం ముడు పాటలే బ్యాలెన్స్ ఉన్నాయనీ, మిగిలిన సినిమా షూటింగంతా పూర్తయిందనీ సమాచారం. ఈ రామ్ "కందిరీగ"సినిమాకి తమన్ సంగీతం అందిస్తూండగా, కెమెరా ఆండ్ర్యూ హ్యాండిల్ చేస్తూండగా. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీని నిర్వహిస్తున్నారు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.