English | Telugu
జగన్ ఆఫర్ తిరస్కరించిన మహేష్ బాబు
Updated : Jun 7, 2011
జగన్ ఆఫర్ తిరస్కరించిన మహేష్ బాబు అని ఫిలిం నగర్ లో బలంగా ఒక రూమర్ వినపడుతోంది. వివరాల్లోకి వెళితే మన రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న యువ నాయకుడు వై.యస్.జగన్మోహన్ రెడ్డి అనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి జగన్ తన పార్టీలోకి మహేష్ బాబుని ఆహ్వానించాడనీ, కానీ మహేష్ బాబు ఆ ఆఫర్ ని తిరస్కరించాడనీ ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. గత కొన్నిదశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ ప్రస్తుతం జగన్ స్థాపించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళనున్నారనే మరో రూమర్ ఫిలిం నగర్ లో వినిపిస్తోంది.
తండ్రి కృష్ణ తన పార్టీలోకి వస్తే ఆటోమేటిక్ గా ఆయన కుమారుడు మహేష్ బాబు కూడా తన పార్టీలోకే వస్తాడనీ, తద్వారా యువతని తన పార్టీవైపు ఆకర్షింపచేసుకోవచ్చనీ జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. కానీ రాజకీయాలంటేనే పడని మహేష్ బాబు తాను ఏ రాజకీయపార్టీకి మద్దతునివ్వననీ, ప్రస్తుతం తన దృష్టి అంతా తాను నటిస్తున్న సినిమాల మీదేననీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారట. మరి ఇదెంతవరకూ నిజమో కానీ కృష్ణ గనక జగన్ పార్టీలో చేరితే మాత్రం సినీ పరిశ్రమలో రాజకీయ సమీకరణాలు మారతాయనటంలో సందేహం అక్కరలేదు.