English | Telugu

తెలుగు సినిమాని ఎవర్రా చంపేది.. అంత దమ్ముందా మీకు!

-గూబ పగిలేలా చేసిన తెలుగు సినిమా
-ఎక్కడున్నారు మీరంతా
-తెలుగు సినిమా ఏం చెప్పింది
-థియేటర్స్ లో ఉన్న సినిమాల పరిస్థితి ఏంటి!

సిల్వర్ స్క్రీన్ పై హీరోతో పాటు 24 క్రాఫ్ట్స్ నుంచి వచ్చే సినీ విన్యాసాలని చూడాలంటే పెట్టి పుట్టాలనే సామెత ఎప్పట్నుంచో ఉంది. సదరు విన్యాసాలు అభిమానులు, మూవీ లవర్స్, ప్రేక్షకులకి సరికొత్త లోకాన్ని పరిచయం చేస్తాయి. పరిచయం చేయడమే కాదు వాళ్ళ వ్యక్తిగత ఎదుగుదలకి కూడా ఉపయోగపడతాయనే సజీవ సాక్ష్యానికి ఎన్నో ఉదాహరణలు. పైగా తనప్రజలని ఏదైనా అనుకోని ఆపద వచ్చినప్పడు కోట్ల రూపాయల డబ్బుని కూడా సినిమా ఇస్తుంది. అందుకే వాళ్ళందరు సినిమాని తమని ముందుకు నడిపించే కంటికి కనపడే దైవంగా కొలుస్తారు. సినిమా కూడా ప్రేక్షకామృతాన్ని తాగిన అమరత్వాన్ని పొంది కొన్ని దశాబ్దాలుగా తన తన సత్తా చాటుతూ వెళ్తుంది. ఇదంతా అందరకి తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆ అవసరం వెనక ఉన్న కారణాన్ని ఒకసారి చూద్దాం.

గత కొంత కాలంగా తెలుగు సినిమా హిట్ ల శాతాన్ని చాలా తక్కువగా చూస్తుంది. దీంతో తెలుగు సినిమా వినాశనాన్ని కోరుకునే రాక్షస ఘనం ఒకటి సోషల్ మీడియా వేదికగా ఏర్పడింది. దీంతో సదరు రాక్షస ఘనం తెలుగు సినిమా పతనం అయిపోనట్లే అని, ప్రేక్షకులు కూడా ఇక సినిమాలు చూడటం మానెయ్యబోతున్నారనే మాటల్ని వినిపిస్తున్నాయి. అలాంటి వాళ్లందరికీ ఇప్పుడు సంక్రాంతికి వచ్చిన సినిమాలు ఒక చెంపపెట్టుగా నిలిచాయి. రాజా సాబ్(The Raja saab)రిలీజ్ రోజు వచ్చిన టాక్ కంటే ఇప్పుడు పర్లేదనే స్థాయికి వెళ్ళింది. టెక్నీకల్ గా కూడా తెలుగు సినిమా స్థాయిని పెంచిందనే మాటలు ప్రేక్షకుల నుంచి వినిపిస్తున్నాయి.మెగా, విక్టరీ, అనిల్ రావిపూడి, నయనతార ల మన శంకర వరప్రసాద్(Mana Shankara Varaprasad Garu)హిట్ టాక్ తో జెట్ స్పీడ్ వేగంతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తూ రికార్డు కలెక్షన్స్ వైపు దూసుకెళ్తుంది.

అమెరికా నుంచి అనకాపల్లి దాకా తెలుగు ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. నిన్న విడుదలైన రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'(Bhartha Mahasayulaku wignyapthi)కూడా పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. ఎంటర్ టైన్ మెంట్ ఒక లెవల్లో ఉందనే వార్తలు వస్తుండటంతో తెలుగు సినిమా ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. ఇక ఈ రోజు రిలీజైన నవీన్ పోలిశెట్టి, నాగ వంశీ ల 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)కూడా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. హిట్ టాక్ వస్తే తెలుగు సినిమా ప్రేక్షకులు ఏం చేస్తారో తెలిసిందే.


Also read:భర్త మహాశయులకు విజ్ఞప్తి ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే!.. ఫ్యాన్స్ హ్యాపీ


ఎన్ని పనులు ఉన్నా, అవన్నీ ఇప్పుడే ఉండేవే అని అన్నం తినటం కూడా మానేసి చలో టూ అనగనగా ఒక రాజు కి జై అంటూ సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేస్తారు. ఇక ఈ రోజు ఈవినింగ్ ఐదు గంటల ఆట నుంచే థియేటర్స్ లో అడుగుపెడుతున్న శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి(Nari Nari Naduma Murari)కి కూడా సినీ సర్కిల్స్ లో పాజిటివ్ టాక్ వస్తుంది.దీంతో థియేటర్స్ దగ్గర తెలుగు సినిమా ప్రేక్షకుల క్యూ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పక్కర్లేదు.

దీంతో తెలుగు సినిమా బతకకూడదని కోరుకునే రాక్షస ఘనం తమ కళ్ళ వెంట వచ్చే కన్నీళ్ళని తుడుచుకోవడానికి కర్చీఫ్ ల కోసం షాప్ ముందు క్యూ కట్టాల్సిన పరిస్థితి. నాలుగు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలతో తెలుగు సినిమానే ఆ పని చెయ్యడం కొసమెరుపు. ఇక అదే సమయంలో తెలుగు సినిమా అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తెలుగు సినిమా గెలవడమే కాదు ఈ సంక్రాంతికి సరికొత్త సినీ మజాని ఇచ్చారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.