English | Telugu

ముంబైకి షిఫ్ట్ అవుతున్న సూర్య - జ్యోతిక‌!

క‌పుల్ గోల్స్‌ని ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌గా సెట్ చేస్తుంటారు సూర్య‌, జ్యోతిక‌. లేటెస్ట్ గా వారికి సంబంధించిన ఓ వార్త తెగ వైర‌ల్ అవుతోంది. వారిద్ద‌రూ ముంబైకి షిఫ్ట్ అవుతున్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి. బాలీవుడ్ సెల‌బ్రిటీలు, రాజ‌కీయ ప్ర‌ముఖులు ఉండే ప్ర‌దేశంలో ఓ పెద్ద ఇల్లు కొనుగోలు చేశారు. తొమ్మిదివేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణం ఉన్న ఇంటిని కొనుగోలు చేశార‌ట‌. దీనికోసం దాదాపు 70 కోట్లు ఖర్చుపెట్టార‌ట‌. ప్ర‌స్తుతం జ్యోతిక హిందీ సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ‌గా ముంబైలోనూ, చెన్నైలోనూ జ‌రుగుతోంది. పైగా సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై హిందీలోనూ సినిమాల‌ను నిర్మిస్తున్నారు. వెళ్లిన ప్ర‌తిసారీ అక్క‌డ హోటల్స్ లో ఉండ‌టం క‌న్నా సొంతంగా ఓ ఇంటిని ఏర్పాటు చేసుకోవాల‌ని అనుకున్నార‌ట‌. మ‌రోవైపు పిల్ల‌ల చ‌దువుల కోసం అక్క‌డ ఇల్లు తీసుకున్నార‌నే మాట కూడా వినిపిస్తోంది.

ప‌ర్మ‌నెంట్‌గా అక్క‌డికి వెళ్ల‌ర‌ని, జ‌స్ట్ అక్క‌డ కూడా ఒక లివింగ్ స్పేస్ కావాల‌ని ఇల్లు కొనుగోలు చేశార‌న్న‌ది మ‌ళ్లీ మ‌ళ్లీ వినిపిస్తున్న మాట‌. సూర్య‌, జ్యోతిక ఇద్ద‌రూ ప్రేమించుకుని పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇప్ప‌టికీ, సూర్య ఫ్యామిలీతో క‌లిసే ఉంటున్నారు జ్యోతిక‌.సూర్య‌ను పెళ్లి చేసుకుని తాను త‌మిళ్ మాట్లాడ‌టం నేర్చుకున్నాన‌ని, ఇప్ప‌టికీ సూర్య‌కు హిందీ మాట్లాడ‌టం రాద‌ని చాలా సార్లు చెప్పుకొచ్చారు జ్యోతిక‌. సూర్య ప్ర‌స్తుతం సిరుత్తై శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓసినిమా చేస్తున్నారు. స్టూడియో గ్రీన్‌, యువీ క్రియేష‌న్ క‌లిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. దిశా పఠాని నాయిక‌గా న‌టిస్తున్నారు. త‌మిళ కొత్త సంవ‌త్స‌రాదిని పురస్క‌రించుకుని ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.