English | Telugu
పత్తు తల రిలీజ్ తర్వాతే శింబు పెళ్లి!
Updated : Mar 25, 2023
సౌత్ ఇండియన్ స్టార్ శింబు పెళ్లికి అంతా సిద్ధమవుతోంది. అయితే ఆయన ఇప్పుడు చేస్తున్న పత్తు తల విడుదల తర్వాతే ఈ విషయాల గురించి మాట్లాడుతానని అంటున్నారు. కోలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ లిస్టులో ఉంటారు విశాల్, సిద్ధార్థ్, శింబు తదితరులు. వీళ్లల్లో మిగిలిన వాళ్ల సంగతేమోగానీ, శింబు పెళ్లి వార్తలు మాత్రం తరచూ వినిపిస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇటీవల పత్తుతల ప్రెస్‌మీట్‌లో వినిపించిన మాటలు ఇంట్రస్టింగ్‌గా మారాయి. రీసెంట్‌గా పత్తుతల ప్రెస్‌మీట్ జరిగింది. ఈ ప్రెస్‌మీట్‌లో రైటర్ శరణ్ మాట్లాడుతూ ``దర్శకుడు కృష్ణతో పనిచేసిన ప్రతి ఒక్కరికీ పెళ్లిళ్లయ్యాయి. సూర్య, జ్యోతిక, ఆర్య, గౌతమ్ కార్తిక్‌కి పెళ్లిళ్లయ్యాయి. ఇప్పుడు శింబు కి కూడా పెళ్లి ఫిక్స్ అవుతుంది`` అని అన్నారు. ఆ మాటలు విన్న శింబు `ముందే ఈ విషయం నాతో చెప్పొచ్చు కదా` అని అనడంతో అక్కడ నవ్వులు విరిశాయి.
కెరీర్ ప్రారంభం నుంచి శింబుకి పలువురు నాయికలతో ప్రేమాయణం అంటూ వార్తలొచ్చాయి. నయనతార, హన్సిక మోత్వాని, నిధి అగర్వాల్‌తో శింబు ప్రేమవ్యవహారాలున్నాయన్నది కోలీవుడ్‌లో వినిపించే మాట. నిధి అగర్వాల్‌తో పెళ్లి ఖాయం అంటూ చాలా మంది రాశారు. కానీ అది కూడా రూమరేనని తేలిపోయింది. శ్రీలంకకు చెందిన అమ్మాయిని శింబు తల్లిదండ్రులు చూశారన్నది ఒక టాక్. శింబు మాత్రం వాటి గురించి పట్టించుకోకుండా పత్తుతల ప్రమోషన్లలో ఉన్నారు. కన్నడలో విడుదలైన మఫ్టి సినిమాకు రీమేక్ పత్తు తల. ఇందులో గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తారు శింబు. ఇటీవల ట్రైలర్ విడుదలైంది. ఒబెలి కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో గౌతమ్ , ప్రియా భవానీ శంకర్, గౌతమ్ వాసుదేవమీనన్, తీజే, జియో మల్లూరి, కలైయరసన్, రెడిన్ కింగ్‌స్లే కీ రోల్స్ చేశారు. ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్ చేస్తున్నారు. ఉత్తర మీనన్ కాస్ట్యూమ్ డిజైనింగ్ చేశారు. పత్తుతల సినిమా మార్చి 30న విడుదల కానుంది.