English | Telugu

సూర్య‌కి మాటిచ్చిన రాజ‌మౌళి?

బాహుబ‌లి త‌ర‌వాత రాజ‌మౌళి ఏం చేస్తాడ‌న్న‌దానిపై ర‌క‌ర‌కాల వార్త‌లొస్తున్నాయి. పార్ట్ 2 ప‌నిచూసే ముందు రాజ‌మౌళి ఓ సినిమా చేస్తే... అది ఎవ‌రితో అనే..? ఆస‌క్తి నెల‌కొంది. తాజా స‌మాచారం ప్ర‌కారం రాజ‌మౌళి - సూర్య సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

సూర్య అంటే రాజ‌మౌళికి, రాజ‌మౌళి అంటే సూర్య‌కు ప్ర‌త్యేకమైన అభిమానం. దానికి తోడు `బాహుబ‌లి`ని సూర్య కూడా తెగ మోస్తున్నాడు. ఇలాంటి సినిమాలో నాకూ ఓ చిన్న పాత్ర ఇవ్వండి అంటూ రాజ‌మౌళిని కూడా అడిగేశాడు. అంతేనా..?? త‌మిళంలో సూర్య‌నే ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాడు. అందుకే `నా త‌దుప‌రి సినిమా మీతోనే` అని సూర్య‌కి రాజ‌మౌళి మాటిచ్చిన‌ట్టు టాక్‌.

సూర్య‌కి తెలుగులో నేరుగా ఓ సినిమా చేయాల‌నే ఆలోచ‌న ఎప్ప‌టి నుంచో ఉంది. అయితే క‌థ‌లు, ద‌ర్శ‌కులు సెట్ అవ్వ‌డం లేదు. రాజ‌మౌళి లాంటి ద‌ర్శ‌కుడు ఆఫ‌ర్ ఇస్తే.. సూర్య ఎందుకు కాదంటాడు..? సో.. ఈ ప్రాజెక్టు దాదాపుగా పక్కా అయిన‌ట్టే.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.