English | Telugu

‘శంబాల’ చిత్రానికి పాజిటివ్‌ టాక్‌.. సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చేసిన ఆది!

Publish Date:Dec 25, 2025

సీనియర్‌ నటుడు సాయికుమార్‌ నట వారసుడిగా ‘ప్రేమకావాలి’ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు ఆది సాయికుమార్‌. తొలి సినిమాతోనే హీరోగా మంచి పేరు తెచ్చుకొని యూత్‌లో ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారు. ఆ తర్వాత చేసిన ‘లవ్‌లీ’ చిత్రం కూడా మంచి హిట్‌గా నిలిచింది. 2013లో ఆది హీరోగా వచ్చిన ‘సుకుమారుడు’ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అప్పటి నుంచి ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ‘షణ్ముక’ వరకు దాదాపు 20 సినిమాల్లో హీరోగా విభిన్నమైన పాత్రలు పోషించారు. వాటిలో ఒకటి, రెండు తప్ప ఆది కెరీర్‌ గ్రాఫ్‌ పెరిగేందుకు ఉపయోగపడలేదు. అయితే అతనికి ప్రతి సినిమాలోనూ నటుడిగా మంచి పేరు వచ్చింది.    అందం, అభినయం ఉంటూనే ఒక కమర్షియల్‌ హీరోకి ఉండాల్సిన అన్ని లక్షణాలు కలిగిన తన కుమారుడు సక్సెస్‌ఫుల్‌ హీరోగా తనకంటూ ఒక మార్క్‌ క్రియేట్‌ చేసుకోవాలని సాయికుమార్‌ తపనపడ్డారు. ఒక సాలిడ్‌ హిట్‌ కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారు. అలాంటి హిట్‌ సినిమా.. తాజాగా విడుదలైన ‘శంబాల’ రూపంలో వచ్చింది. డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ కానుకగా విడుదలైన ఈ సినిమాకి యునానిమస్‌గా పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. హారర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో ఆది హిట్‌ ట్రాక్‌లోకి వచ్చినట్టేనని రిపోర్ట్స్‌ చెబుతున్నాయి. పురాణాలను లింక్‌ చేస్తూ ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాలో విక్రమ్‌ అనే సైంటిస్ట్‌ పాత్రను ఆది సమర్థవంతంగా పోషించారని అందరూ అప్రిషియేట్‌ చేస్తున్నారు. దీన్నిబట్టి ఆది కెరీర్‌కి ఇక ఢోకా ఉండదనేది అర్థమవుతోంది. 

Champion Movie Review 

Publish Date:Dec 25, 2025

Cast: Roshan Meka, Anaswara Rajan, Nandamuri Kalyan Chakravarty, Racha Ravi, Prakash Raj, Naresh, Avantika, Dulquer Salmaan, KK Menon, Murli Sharma, Santosh Pratap     Crew:  Written by Rutham Samar, Pradeep Advaitam  Cinematography by Madhie Music by Mickey J Mayer Edited by Kotagiri Venkateswara Rao Directed by Pradeep Advaitam  Produced by Priyanka Dutt, Umesh Kumar Bansal, Gemini Kiran, G.K. Mohan  Roshan Meka has become one of the most exciting young talents in Telugu Cinema. His looks and screen presence have established him among Gen-Z audiences. Anaswara Rajan's Gira Gira song became a huge sensation further creating anticipation for Champion. Let's discuss about the film in detail.  Plot:  In the year 1948, Michael Williams (Roshan Meka), hailing from Secunderabad, hopes to leave India as his father George (Dulquer Salmaan) is named as traitor and he ends up an orphan. He is a good football player and he dreams to be knighted by Queen Elizabeth.  But circumstances force him to take shelter in Bairanpally and he meets Chandrakala (Anaswara Rajan), Raji Reddy (Nandamuri Kalyan Chakravarty), and many real life heroes of the revolt. Will their friendship change him? How did Bairanpally revolt become starting point of Operaton Polo? Watch the movie to know more.  Analysis:  Roshan Meka proves himself as a very skilled and dedicated actor. He gives everything to the character and he is able to shine in a role that requires great maturity from a youngster. His dialogue delivery needs to improve slightly but he is a talent to reckon with.  Anaswara Rajan impresses with her commitment to learn Telugu and her acting skills are exemplary. Nandamuri Kalyan Chakravarty doesn't really make any impact. Racha Ravi, Prakash Raj, Dulquer Salmaan, KK Menon, Santosh Pratap and many actors make a good impression.  But the narrative falters as everything is predictable and screenplay is too lethargic. With flat content and laggy scenes, the movie kills its own chance at greatness. While everyone in the cast and crew have given their best, the writing completely undermines the effectiveness.  Pre-climax where the film needs to rise up above the narrative just feels like a drag. Historical inaccuracies also undermine it. Production values of Swapna Cinema, Vyjayanthi Movies stand out and their passion to create visual spectacle is commendable. But everything boils down to writing and it has gone downhill progressively from beginning to end.  Bottomline:  Movie could have been a big box office Champion but writing undermines it.  Rating: 2.75/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.

Shambhala Movie Review

Publish Date:Dec 24, 2025

ఎవరికీ తలొగ్గని భానుమతి.. ఓ సంగీత దర్శకుడికి పాదాభివందనం చేశారు.. ఎందుకో తెలుసా?

Publish Date:Dec 23, 2025

(డిసెంబర్ 24 భానుమతి వర్థంతి సందర్భంగా..) పాతతరం నటీమణుల్లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్న భానుమతి గురించి అందరికీ తెలిసిందే. వివిధ శాఖల్లో విశేషమైన ఖ్యాతిని సంపాదించుకున్న ఆమె.. చిన్నతనంలో తండ్రి దగ్గర సంగీతాభ్యాసం చేశారు. ఆమె స్వరం చాలా విభిన్నంగా ఉంటుంది. సినిమా రంగంలో స్థిరపడిన తర్వాత ఎన్నో పాటలు పాటలు పాడారు. ఆమె పాటలకు ప్రత్యేకంగా అభిమానులు ఉండేవారు. అంతేకాదు, కొన్ని సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు.   తిరుగులేని ఆత్మవిశ్వాసం, తనకు నచ్చని ఏ విషయాన్నయినా ఖండించడం అనేది భానుమతికి చిన్నతనం నుంచీ అబ్బిన లక్షణం. అందుకే అనవసర విషయాల గురించి ఆమె దగ్గర ప్రస్తావించేవారు కాదు. ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ వంటి స్టార్‌ హీరోలు కూడా ఆమెతో కలిసి నటించేందుకు భయపడేవారు. సినిమా రంగంలో ఇలాంటి లక్షణాలు ఉన్నవారు రాణించడం చాలా కష్టం. కానీ, భానుమతి మాత్రం దానికి అతీతంగా అద్భుతమైన విజయాలు సాధించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు.    ఎన్టీఆర్‌, భానుమతి జంటగా నటించిన మల్లీశ్వరి ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎస్‌.రాజేశ్వరరావు. అప్పటి సంగీత దర్శకుల్లో రాజేశ్వరరావు ఓ విభిన్న వ్యక్తిత్వంతో ఉండేవారు. తను చేసే సంగీతం గురించి ఎవరైనా విమర్శించినా, సలహాలు ఇవ్వాలని చూసినా, తను చెప్పిన విధంగా గాయనీగాయకులు పాడకపోయినా ఆయనకు వెంటనే కోపం వచ్చేది. మారు మాట్లాడకుండా తన హార్మోనియం పెట్టెను తీసుకొని అక్కడి నుంచి బయటికి వచ్చేసేవారు. ఎంత పెద్ద హీరో, దర్శకనిర్మాతలైనా ఆయన ధోరణి అలాగే ఉండేది.    తనకు అసౌకర్యంగా ఉన్న వాతావరణంలో రాజేశ్వరరావు సంగీతం చేసేవారు కాదు. అలా సినిమా మధ్యలోనే వచ్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మాయాబజార్‌ వంటి సినిమాలో నాలుగు పాటలు కంపోజ్‌ చేసిన తర్వాత నిర్మాతల ధోరణి నచ్చక ఆ సినిమా నుంచి బయటికి వచ్చేశారు. 'శ్రీకరులు దేవతలు..', 'లాహిరి లాహిరి లాహిరిలో..', 'నీ కోసమే నే జీవించునది..', 'చూపులు కలిసిన శుభవేళ..' పాటలు ఎస్‌.రాజేశ్వరరావు కంపోజ్‌ చేసినవే. మిగతా పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ను ఘంటసాలతో చేయించారు. టైటిల్స్‌లో తన పేరు వేయకపోయినా రాజేశ్వరరావు బాధపడలేదు.    ఎన్టీఆర్‌ దర్శత్వంలో వచ్చిన దానవీరశూర కర్ణ చిత్రానికి మొదట అనుకున్న సంగీత దర్శకుడు ఎస్‌.రాజేశ్వరరావు. అందులో ఒక పాట చేసిన తర్వాత ఎన్టీఆర్‌ సోదరుడు త్రివిక్రమరావు పాటలు ఎలా ఉండాలి అనే విషయంలో రాజేశ్వరరావుకు సలహా ఇవ్వాలని చూశారు. ఆ క్షణమే ఎన్టీఆర్‌ దగ్గరకు వెళ్లి 'మీ తమ్ముడికి సంగీత జ్ఞానం బాగా ఉంది. అతనితోనే మ్యూజిక్‌ చేయించుకోండి' అని చెప్పి అక్కడి నుంచి వచ్చేశారు. ఆ సినిమాలో ఎంతో పెద్ద హిట్‌ సాంగ్‌ అయిన 'ఏ తల్లి నిను కన్నదో..' పాట రాజేశ్వరరావు కంపోజ్‌ చేసిందే. ఆ తర్వాత పెండ్యాల నాగేశ్వరరావుతో మిగతా పాటలు చేయించుకున్నారు ఎన్టీఆర్‌.    ఇక 'మల్లీశ్వరి' సినిమాకి సంబంధించి మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నప్పుడు 'మనసున మల్లెల మాలలూగెనే..' పాటను ఎలా పాడాలో భానుమతికి చెబుతున్నారు రాజేశ్వరరావు. కానీ, కొన్ని సంగతులు ఆయన చెప్పినట్టు కాకుండా తనదైన ధోరణిలో పాడుతున్నారు భానుమతి. తను చెప్పినట్టుగా పాడితేనే పాట బాగా వస్తుందని, తేకపోతే పాట చెడిపోతుందని ఆయన చెప్పారు. కానీ, భానుమతి మాత్రం తను అనుకున్న విధంగానే పాడారు. పైగా తనకు కూడా సంగీత జ్ఞానం ఉంది అంటూ గుర్తు చేశారు. ఆమె అలా అనడంతో వెంటనే అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న దర్శకుడు బి.ఎన్‌.రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ని బ్రతిమాలి తీసుకొచ్చారు. చివరికి రాజేశ్వరరావు ఎలా పాడమన్నారో అలాగే పాడారు భానుమతి.    రికార్డింగ్‌ పూర్తయిన తర్వాత యూనిట్‌ సభ్యులతో కూర్చొని ఆ పాటను విన్నారు భానుమతి. ఆ పాటను రాజేశ్వరరావుగారు అలా ఎందుకు పాడమన్నారో ఆమెకు అప్పుడు అర్థమైంది. క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా ఆయన దగ్గరకు వెళ్లి పాదాభివందనం చెయ్యబోయారు. కానీ, రాజేశ్వరరావు వారించారు. 'మీరు పాటను అలా ఎందుకు పాడమన్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను తప్పుగా మాట్లాడాను. నన్ను క్షమించండి' అని రాజేశ్వరరావుకు నమస్కారం చేశారు భానుమతి.

దృశ్యం3కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చేసింది

Publish Date:Dec 22, 2025

ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో సిరీస్ వ‌చ్చాయి. వాటిలో దృశ్యం సిరీస్‌కి ఒక ప్ర‌త్యేక స్థానం ఉంది. ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటూనే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకి సంబంధించి ఇప్ప‌టికే రెండు భాగాలు రిలీజ్ అయి మంచి విజ‌యాన్ని అందుకున్నాయి. దృశ్యం చిత్రానికి సంబంధించిన రెండు పార్టులు మ‌ల‌యాళం, తెలుగు, హిందీ భాష‌ల్లో రూపొందాయి. ఈ చిత్రానికి సంబంధించిన మూడో భాగం మాత్రం మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో రూపొందుతోంది. ఇటీవ‌లికాలంలో హిందీలో మంచి విజ‌యాన్ని సాధించిన సిరీస్ ఇదే కావ‌డం విశేషం. ప్రస్తుతం మ‌ల‌యాళం, హిందీ వెర్ష‌న్ల‌కు సంబంధించిన షూటింగ్స్ జ‌రుగుతున్నాయి. మ‌ల‌యాళ వెర్ష‌న్‌కు జీతు జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, హిందీ వెర్ష‌న్‌ను అభిషేక్ పాఠక్ రూపొందిస్తున్నారు.    ఇదిలా ఉంటే.. దృశ్యం3 హిందీ వెర్ష‌న్‌కి సంబంధించి రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. అజ‌య్‌దేవ్‌గ‌ణ్ వాయిస్ ఓవ‌ర్‌తో న‌డిచే ఈ వీడియోలో దృశ్యం 3 ఎలా ఉండబోతోంది అనేది ఇంట్రెస్టింగ్‌గా చెప్పారు. షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2026 అక్టోబ‌ర్ 2న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ మూడో భాగంతో దృశ్యం క‌థ ముగుస్తుంద‌ని తెలుస్తోంది. స్టార్ స్టూడియో18 సమర్పణలో, పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లేను అభిషేక్ పాఠక్, ఆమిల్ కీయాన్ ఖాన్, పర్వీజ్ షైఖ్ కలిసి అందించారు. అలొక్ జైన్, అజిత్ అందారే, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.  ఈ సినిమాకి సంబంధించిన రెండు భాగాల మాదిరిగానే మూడో భాగం కూడా ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌ని బాలీవుడ్ ట్రేడ్‌వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. 

ఇన్నోసెంట్ మదర్స్ అంతరించిపోయారు..పెద్దాళ్ళను చంపేవాళ్లు మృగాలే

Publish Date:Dec 25, 2025

టేస్టీ తేజ ఒక జబర్దస్త్ కమెడియన్ గా అలాగే ఫుడ్ వ్లాగర్ అందరికీ పరిచయమే. అలాంటి తేజ ఒక ఇంటర్వ్యూలో ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. '90s జనరేషన్ కదా అప్పటికి ఇప్పటికీ నువ్వు గమనించిన మార్పులు ఏంటి" అంటూ హోస్ట్ అడిగేసరికి "మార్పులు ఏమీ లేవు కానీ ఒక మార్పు గట్టిగా కనిపిస్తోంది. ఇన్నోసెంట్ మదర్స్ అంటారు కదా అది మన జనరేషన్ తోనే ఎండ్.  అప్పటిలో మమ్మీస్ అంతరించిపోయారు అనేవాళ్ళు కదా అలా మన జనరేషన్ తోనే ఇన్నోసెంట్ మదర్స్ అంతరించిపోయారు. ఇన్నోసెంట్ మదర్స్ లేరు ఇన్నోసెంట్ ఫాదర్స్ లేరు. అందరూ ముదుర్లు. మనమే ముదుర్లు అంటే మనకు పుట్టే వాళ్ళు కంచులే. మనం ఇప్పటివరకు మా పేరెంట్స్ ఇన్నోసెంట్ అని చెప్పుకునే వాళ్ళం. కానీ రేపటి పిల్లలు మాత్రం మా పేరెంట్స్ ముదుర్లు అని చెప్పుకుంటారు. ఇది మేజర్ డిఫరెన్స్ నేను గమనించింది. ఐతే కొన్నేళ్ల క్రితం నేను చూసింది పేరెంట్స్ ని ఇంట్లోంచి గెంటేయడం లేదంటే అనాధాశ్రమాల్లో వేసేసేవాళ్ళు. కానీ ఇప్పుడు నెమ్మదిగా సెల్ఫ్ రియలైజేషన్ వచ్చింది. మమ్మల్ని కన్నారు పెంచారు కదా మేము చూడాలి కదా అనుకుంటున్నారు.  ఐతే ఆర్ధిక ఇబ్బందుల వలన అలా చేస్తున్నారు. కొంతమంది ఐతే పెద్దవాళ్ళు అడ్డుగా ఉంటున్నారని చంపేస్తున్నారు వాళ్ళను మృగాలు అనాలి. ఒకప్పుడు అవకాశాలు లేక అలా చేశారనుకుంటే ఇప్పడు అవకాశాలు పెరిగాయి. ఐనా కూడా చేస్తున్నారంటే ఏమీ చేయలేక లాస్ట్ ఆప్షన్ గా అలా చేస్తున్నారు అంటే అది దరిద్రం దారుణం ఇంకా వాళ్ళు మృగాలే." అని చెప్పాడు టేస్టీ తేజ.

బ‌న్నీ, లోకేష్ కాంబినేష‌న్‌లో సినిమా.. మ‌రి త్రివిక్ర‌మ్ మాటేమిటి?

Publish Date:Dec 25, 2025

అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ కాంబినేష‌న్‌లో ఓ హై టెక్నిక‌ల్ మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్థంలో పూర్త‌య్యే అవ‌కాశం ఉంది. అయితే ఈ సినిమా త‌ర్వాత బ‌న్నీ చేయ‌బోయే సినిమా గురించి ఇప్ప‌టి నుంచే ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ఇటీవ‌ల త‌న అమెరికా ప‌ర్య‌ట‌న‌ను ముగించుకొని హైద‌రాబాద్ వ‌చ్చిన బ‌న్నీని త‌మిళ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ క‌లిశారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఓ సినిమా ఉంటుంద‌ని చాలా కాలంగా వార్త‌లు వ‌స్తున్నాయి.  తాజాగా జ‌రిగిన బ‌న్నీ, లోకేష్ మీటింగ్ ప్రాధాన్యాన్ని సంత‌రించుకుంది. వీరి కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుంద‌నే ప్ర‌చారానికి బ‌లం చేకూరింది. అదే నిజమైతే అట్లీ సినిమా పూర్తి కాగానే లోకేష్ ప్రాజెక్ట్‌కి ముహూర్తం నిర్ణ‌యించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. లోకేష్ సినిమాటిక్ యూనివ‌ర్స్ ఎంత పాపుల‌ర్ అయిందో అంద‌రికీ తెలిసిందే. అందులో భాగంగానే ఈ సినిమా ఉంటుంద‌ని తెలుస్తోంది. దాంతో అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డుతున్నాయి.  ఇదిలా ఉంటే.. త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో బ‌న్నీ చేయ‌బోయే సినిమాపై ఒక క్రేజీ అప్‌డేట్ బ‌య‌టికి వ‌చ్చింది. ఇప్ప‌టికే జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమాలు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చాయి. మూడో సారి వీరిద్ద‌రూ క‌లిసి సినిమా చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే మ‌ధ్య‌లో ఎన్టీఆర్ పేరు వినిపించింది. తాజా స‌మాచారం మేర‌కు ఈ ప్రాజెక్ట్ మ‌ళ్లీ బ‌న్నీ ద‌గ్గ‌రికే వ‌చ్చింద‌ట‌. పురాణాల ఆధారంగా కార్తికేయుడి కథతో త్రివిక్రమ్ ఒక భారీ సోషియో ఫాంటసీ కథను సిద్ధం చేశార‌ట‌. అయితే లోకేష్‌, త్రివిక్ర‌మ్‌.. ఈ ఇద్ద‌రిలో ఎవ‌రి సినిమా మొద‌ట స్టార్ట్ అవుతుంద‌నేది తెలియాల్సి ఉంది. 

Is Suriya's Karuppu looking to compete with Dhurandhar 2?

Publish Date:Dec 20, 2025

Suriya starrer Karuppu being directed by RJ Balaji has been struggling with financial issues even though movie is 95% complete. A song and few scenes needs to be shot and the makers are planning to complete the shoot in January. Now, the makers are planning to release on 19th March 2026.  Already, the movie has been facing huge troubles with low asking price from OTT platforms which makers are not happy with. Suriya has been facing huge downtime in his career, so he is expecting Karuppu to be his major comeback at the box office. Meanwhile, he moved on to his next Suriya46 with Venky Atluri.  Sithara Entertainments is producing the film and Mamitha Baiju is playing a leading role in it. The makers have wrapped up shoot completely and they have started post-production works locking May date. Hence, Karuppu cannot go for a further date than Atluri's film.  Meanwhile, Jithu Madhavan's cop film with Suriya will complete shoot by May and the actor, who is producing it himself, doesn't want to take it to 2027, unless works are pending or slowed down it seems.   So, Karuppu makers need to lock March date and so, despite competition with Dhurandhar and Yash's Toxic, they might for the date, say sources. With Dhurandhar being such a massive hit, Part-2 will shatter all box office records in opening weekend for sure. Going against it would be a suicide but makers have no choice, it seems. Let's wait for official confirmation.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

మోగ్లీ

Publish Date:Dec 31, 1969

అఖండ 2

Publish Date:Dec 31, 1969

Mowgli

Publish Date:Dec 31, 1969

Akhanda 2

Publish Date:Dec 31, 1969

Revolver Rita

Publish Date:Dec 31, 1969

Andhra King Taluka

Publish Date:Dec 31, 1969

Raju Weds Rambai

Publish Date:Dec 31, 1969