English | Telugu

పవర్ స్టార్ 'ఓజీ'లో 'పొగరు' భామ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఓజీ'. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ప్రకటనతోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సెట్స్ నుంచి విడుదలైన పవన్ పిక్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆయన లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాలోని ముఖ్య పాత్రల కోసం ప్రముఖ నటీనటులను రంగంలోకి దింపుతున్నారు.

'ఓజీ'లో అర్జున్ దాస్ నటిసున్నట్లు ఇటీవల ప్రకటించిన మేకర్స్.. తాజాగా నటి శ్రియా రెడ్డి కూడా ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో భాగమవుతున్నట్లు అనౌన్స్ చేశారు. విలక్షణ నటనతో తమిళ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రియా రెడ్డి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. 'అప్పుడప్పుడు', 'అమ్మ చెప్పింది' వంటి సినిమాల్లో నటించింది. అలాగే విశాల్ 'పొగరు' సినిమాలో ఆమె పోషించిన నెగటివ్ రోల్ కి మంచి పేరొచ్చింది. ఇప్పటికే ఆమె ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'సలార్'లో నటిస్తోంది. ఇప్పుడు 'ఓజీ' రూపంలో మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే అవకాశం దక్కించుకుంది. స్క్రిప్ట్ చదివిన ఐదు నిమిషాలకే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు శ్రియా రెడ్డి తెలిపింది. అది ఆ పాత్ర పవర్ అని, దర్శకుడు సుజీత్ మైండ్ బ్లోయింగ్ స్క్రిప్ట్ రాశారని, సినిమా అంచనాలకు మించి ఉంటుందని పేర్కొంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.