English | Telugu

సిగ్గు ప్ర‌కాష్‌రాజ్‌కే లేదు: శ్రీ‌నువైట్ల‌

ప్ర‌కాష్ రాజ్‌, శ్రీ‌నువైట్ల‌.... ఈ దుమారం ఇప్ప‌ట్లో ఆగేట్టు లేదు. ఆగ‌డు సినిమా వ‌చ్చి వెళ్లిపోతున్నా.. ఆ సినిమా సంద‌ర్భంగా వీరిద్ద‌రి మ‌ధ్య రాజుకొన్న వివాదం చినికి చినికి గాలివాన‌గా మారుతోంది. నిన్న ప్ర‌కాష్‌రాజ్ ప్రెస్‌మీట్ పెట్టి..``నా కవిత వాడుకోవ‌డానికి శ్రీ‌నువైట్లకి సిగ్గు లేదా..`` అని ప్ర‌శ్నిస్తే... ఈరోజు స‌మాధానం ఇచ్చారు. నాకు కాదు... ఓ సినిమా ర‌న్నింగ్‌లో ఉండ‌గా నెగిటీవ్ ప్ర‌చారం చేయ‌డానికి నీకే సిగ్గు లేదు... అంటూ రెచ్చిపోయారు. ఇంత‌కీ ఈనాటి (ఆదివారం) ప్రెస్‌మీట్లో శ్రీ‌నువైట్ల ఏం చెప్పారంటే.

''నన్ను ఉద్దేశించి పెట్టిన ఓ ప్రెస్‌మీట్లో నాకోసం ఆయ‌న రాసిన ప‌ద్యం అది. నాకు అంకితం కూడా ఇచ్చారు. అందుకే దానిపై నాకు హ‌క్కుంద‌ని భావించా. అందుకే నా సినిమాలో వాడుకొన్నా. ఓ సినిమా ర‌న్నింగ్‌లో ఉండ‌గా నెగిటీవ్ ప్ర‌చారం చేయ‌డానికి మీకేమైనా సిగ్గుందా?? సినిమా ప‌రిశ్ర‌మ‌పై బ‌తుకుతూ మ‌రో సినిమాకి న‌ష్టం క‌లిగించేలా మాట్లాడ‌డం స‌రైంది కాదు. దూకుడు సినిమాలోని మా డైలాగుల‌పై మేమే ఆగ‌డులో సెటైర్ వేసుకొన్నాం. మ‌హేష్‌తో స‌హా అంద‌రూ దానిపై క్లారిటీ ఇచ్చాం. ప‌వ‌న్ , ఎన్టీఆర్‌లని వాడుకొన్నాన‌ని ప్రెస్‌మీట్లో చెప్పారు. నాకు వాళ్లిద్ద‌రంటే చాలా గౌర‌వం. ఎన్టీఆర్‌తో విజ‌య‌వంత‌మైన సినిమా కూడా తీశా. మామ‌ధ్య మంచి సంబంధాలున్నాయి. ఎవ్వ‌రినీ ఉద్దేశించి ఆ సెటైర్లు వేయ‌లేదు. పొర‌పాటున కొంత‌మంది ప్ర‌చారం చేసినా అది నిజం కాదు. సినిమా ఎలా తీయాలి, ఎలా తీయ‌కూడ‌దు అనేది ప్ర‌కాష్‌రాజ్ ద‌గ్గ‌ర నుంచి నేర్చుకొనే స్థితిలో నేను లేను. సినిమా రిజ‌ల్ట్ అన్ని సార్లూ ఒకేలా ఉండ‌దు. అంద‌రూ బ్లాక్ బ్ల‌స్ట‌ర్లే ఇవ్వ‌రు. ఒక్కోసారి ఫ్లాప్ అవుతుంది. అది నేరంకాదు. ఉల‌వ‌చారు బిరియానీ ఫ‌లితం అంద‌రికీ తెలుసు. ఆ రిజల్ట్‌పై నేనెలాంటి కామెంట్ చేయ‌లేదు. ఎలాంటి పండ‌గా చేసుకోలేదు.

నేను క‌ష్ట‌ప‌డి పైకొచ్చా. చిన్న చిన్న సినిమాలు తీసుకొంటూ ఎదిగా. రిక‌మెండేష‌న్ల‌తో రాలేదు. నా ట్రాక్ రికార్డ్‌, నా క‌ష్టం చూసి మ‌హేష్ నాకు అవ‌కాశం ఇచ్చారు. అహంకారం త‌గ్గించుకోమ‌ని ఆయ‌న స‌లహా ఇవ్వడం హాస్యాస్పందం. ఆయ‌నపై ఉన్న‌న్ని ఎలిగేష‌న్లు ఎవ్వ‌రిపైనా లేవు. మ‌ళ్లీ మ‌ళ్లీ బ‌తిమాలి.. ఇండ్ర‌స్ట్రీకి వ‌చ్చారు. ఆయ‌న్ని సినిమాలోంచి తీసేశాన్న కోపంతో క‌క్ష్య‌తో ఇలాంటివ‌న్నీ చేస్తున్నారు. ఇక‌నైనా ఆయ‌న ఇలాంటివి మానుకొంటే మంచిది. ఆయ‌న‌తో ప‌నిచేయ‌డానికి నాకూ ఎలాంటి అభ్యంత‌రం లేదు. మంచి పాత్ర ఉంటే, ఆయ‌న కావాల‌నుకొంటే.. ఆయ‌న్ని సంప్ర‌దిస్తా. ఇక్క‌డ అంద‌రూ ప‌నిచేయ‌డానికే వ‌చ్చారు...'' అన్నారు శ్రీ‌నువైట్ల‌.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .