English | Telugu

గాయనిగా కలర్స్ స్వాతి

గాయనిగా కలర్స్ స్వాతి కొత్త అవతారమెత్తింది. వివరాల్లోకి వెళితే ఒక టివి ఛానల్లో కలర్స్ అనే కార్యక్రమం ద్వారా పాప్యులర్ అయిన కలర్స్ స్వాతి ఆ తర్వాత నటిగా మారింది. "ఆడవారి మాటలకు అర్థాలు వేరులే" చిత్రంలో హీరోయిన్ త్రిషకు చెల్లిగా నటించింది. ఆ తర్వాత "అష్టా చమ్మా" చిత్రంతో మెయిన్ హీరోయిన్ గా నటించి విజయం సాధించింది. ఆ తర్వాత "కలవరమాయే మదిలో", "గోల్కొండ హైస్కూల్" వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అటువంటి కలర్స్ స్వాతి ఇప్పుడు గాయనిగా కూడా మారింది. వివరాల్లోకి వెళితే యువ హీరో నాగచైతన్య హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా, సుకుమార్ దర్శకత్వంలో, గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్న "100% లవ్" చిత్రం కోసం దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో కలర్స్ స్వాతి ఒక పాట పాడింది. ఆ పాటకు "100% లవ్" చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో దేవీ శ్రీ ప్రసాద్ తో కలసి ఆడింది...పాడింది.

భవిష్యత్తులో పాదే అవకాశాలొస్తే తాను పాడతానంటోంది కలర్స్ స్వాతి. ఒక వేళ సినిమాల్లో నటిమచటానికి అవకాశాలు రాకపోయినా కలర్స్ స్వాతికి ఏం భయంలేదు... ఎంచక్కా గాయనిగా పాటలు పాడుకుంటూ లైఫ్ ని హ్యాపీగా గడిపేయవచ్చు కదా.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.