English | Telugu
మరోసారి 'ధమకా' జోడి.. బ్లాక్ బస్టర్ లోడింగ్!
Updated : Jun 20, 2023
'పెళ్ళిసందడి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలీల 'ధమకా' రూపంలో రెండో సినిమాకే మాస్ మహారాజా రవితేజ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అంతేకాదు ఆ సినిమా విజయంలో శ్రీలీల కీలక పాత్ర పోషించింది. ఆమె అందానికి, డ్యాన్స్ లకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 'ధమకా'తో ఒక్కసారిగా ఆమె బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపు పది సినిమాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే తనకు అచ్చొచ్చిన రవితేజ సరసన శ్రీలీల మరోసారి నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
'డాన్ శీను', 'బలుపు', 'క్రాక్' వంటి హ్యాట్రిక్ విజయాలతో రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ హిట్ కాంబోగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు వీరి కలయికలో నాలుగో సినిమా రూపొందనుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను ఎంపిక చేసినట్లు సమాచారం. అసలే రవితేజ-గోపీచంద్ మలినేని హిట్ కాంబినేషన్. దానికితోడు 'ధమకా' బ్యూటీ శ్రీలీల తోడైంది. మరి అదే జోరుని కొనసాగిస్తూ మరో బ్లాక్ బస్టర్ ని అందుకుంటారేమో చూడాలి.