English | Telugu

శ్రీలీల స్కిన్ షో.. డోసు పెరిగింది బాసూ!

తెలుగు తెరపై శ్రీలీలది జస్ట్ రెండు సినిమాల వయసే. 'పెళ్ళి సందD'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఆపై వచ్చిన 'ధమాకా'తో క్రేజీ బ్యూటీగా టర్న్ అయింది. కట్ చేస్తే.. ప్రస్తుతం అరడజనుకి పైగా సినిమాలు శ్రీలీల ఖాతాలో ఉన్నాయి. అయితే, తొలి రెండు సినిమాల్లో గ్లామర్ పరంగా కొన్ని హద్దులు పాటించిన శ్రీలీల.. రాబోయే చిత్రాల్లో మాత్రం స్కిన్ షో పెంచే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. లేటెస్ట్ గా రిలీజైన.. 'స్కంద'ఫస్ట్ సింగిల్ ప్రోమో చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. "నీ చుట్టు చుట్టు" అంటూ సాగే ఈ పబ్ సాంగ్ లో.. చిట్టి పొట్టి డ్రస్సులో మెరవడమే కాకుండా హాట్ హాట్ ఫోజుల్లో కవ్వించింది శ్రీలీల. దీంతో.. శ్రీలీల స్కిన్ షో పరంగా డోసు పెంచింది బాసూ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రోమోలోనే శ్రీలీల ఈ స్థాయిలో అందాల విందు చేసిందంటే.. ఆగస్టు 3 ఉదయం 9.36 గంటలకు రానున్న పూర్తి స్థాయి పాటలో ఇంకెంత హాట్ గా, ఘాటుగా దర్శనమిస్తుందో చూడాలి.

మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్కంద'లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్నాడు. తమన్ సంగీతమందిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్.. సెప్టెంబర్ 15న వినాయక చవితి కానుకగా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ మాస్ మూవీ వినోదాలు పంచనుంది.