English | Telugu

ర‌జినీకాంత్‌నే వెయిట్ చేయించిన యంగ్ డైరెక్ట‌ర్‌

సినీ ఇండ‌స్ట్రీలో సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఆయ‌న‌తో సినిమా చేయాల‌ని ద‌ర్శ‌కులు ఆస‌క్తి చూపుతుంటారు. అలాంటి హీరోనే ఓ యంగ్ డైరెక్ట‌ర్ వెయిట్ చేసేలా చేశారు. ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రో కాదు.. నెల్స‌న్ దిలీప్ కుమార్‌. త‌లైవ‌ర్ ఇప్పుడు ఏక‌ధాటిగా సినిమాలు చేస్తున్నారు. ఆగ‌స్ట్ నెల 11న జైల‌ర్ మూవీ రిలీజ్ అవుతుంది. సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. ఈ సినిమాకు నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ర‌జినీకాంత్ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని తెలియజేశారు. అన్నాత్తే సినిమా చేసిన త‌ర్వాత ర‌జినీకాంత్ నెక్ట్స్ సినిమాను ఓకే చేయటానికి స‌మ‌యం తీసుకున్నారు. అందుకు కార‌ణం మంచి కథ, దర్శకుడితో సినిమా చేయాలనుకున్నారు.

ఆ స‌మ‌యంలో స‌న్ పిక్చ‌ర్స్ క‌ళానిధి మార‌న్ ఫోన్ చేసి మీ కోసం నెల్స‌న్ అనే డైరెక్ట‌ర్ ద‌గ్గ‌ర మంచి పాయింట్ ఉంది వింటారా? అని ర‌జినీకాంత్‌కు ఫోన్ చేశారు. అందుకు ఆయ‌న ఓకే చెప్పారు. క‌థ చెప్ప‌టానికి ముందు నెల్స‌న్ 20 రోజుల స‌మ‌యాన్ని అడిగారు. ఆయ‌న అందుకు ఓకే చెప్పారు. తీరా 20 రోజుల త‌ర్వాత నెల్స‌న్ రాలేదు. మార‌న్ నుంచి ఫోన్ వ‌చ్చింది. మ‌రో 10 రోజుల స‌మ‌యం కావాల‌ని నెల్సన్ రిక్వెస్ట్ చేస్తున్న‌ట్లు చెప్పారు. దానికి త‌లైవా ఒప్పుకున్నారు.

తీరా 10 రోజుల త‌ర్వాత ఉద‌యం కలుద్దామ‌ని ర‌జినీకాంత్ చెప్పారు. కానీ నెల్స‌న్ అంత పొద్దునే అయితే రాలేన‌ని చెప్పార‌ట‌. అది విని రజినీ షాక‌య్యారు. త‌ర్వాత ప‌దకొండు గంట‌ల‌కు తాపీగా వ‌చ్చి నెల్స‌న్ ర‌జినీకాంత్ ఇంట్లో కాఫీ తాగి మ‌రీ క‌థ చెప్పార‌ట‌. అలా ర‌జినీకాంత్‌నే వెయిట్ చేయించేశారు డైరెక్ట‌ర్ నెల్స‌న్‌. ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్‌, త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ‌ త‌దిత‌రులు న‌టించారు.