English | Telugu
దగ్గుబాటి అభిరామ్ పెళ్ళికి శ్రీలీల కి ఉన్న సంబంధం ఏంటి?
Updated : Dec 6, 2023
అహింస సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన హీరో దగ్గుబాటి అభిరామ్ ఇప్పుడు ఒక ఇంటివాడు కాబోతున్నాడు.ప్రత్యుష అనే అమ్మాయిని తన జీవిత భాగస్వామిగా ఆహ్వానిస్తున్నాడు. వీరిద్దరి వివాహం ఈ నెల 6 న శ్రీలంకలో అంగరంగ వైభవం గా జరగనుంది. అతి కొద్దీ మంది మాత్రమే హాజరయ్యే ఈ వివాహ వేడుకకి ప్రముఖ హీరోయిన్ శ్రీ లీల కూడా హాజరవ్వనుంది. దీంతో శ్రీ లీల కి అభిరామ్ చేసుకోబోయే అమ్మాయికి ఉన్న సంబంధం బయటపడింది.
అభిరామ్ చేసుకోబోయే అమ్మాయి ప్రత్యుష ,శ్రీ లీల ఇద్దరు కూడా చిన్ననాటి నుంచి స్నేహితులు. ఒకరంటే ఒకరికి ప్రాణం. పైగా ఇద్దరు కలిసి అమెరికాలో కూడా చదువుకున్నారు.ఇప్పుడు చేతి నిండా సినిమాలతో శ్రీ లీల ఫుల్ బిజీ గా ఉంది. కానీ తన బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి కావడంతో తన సినిమాల షూటింగ్ లు మొత్తం పక్కన పెట్టేసి అభిరామ్ ప్రత్యుష ల పెళ్ళికి హాజరవుతుంది. హాజరవడమే కాదు పెళ్లి పెద్దగా పెళ్లి మొత్తాన్ని ధూమ్ ధామ్ గా జరపనుంది.
ఇక దగ్గుబాటి వారి ఇంట ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సుమారు 200 మంది అతిధుల దాకా ఈ వివాహ వేడుకలో పాల్గొంటున్నారు. శ్రీలంకలోని అనంతర కలుతారా అనే ఫైవ్ స్టార్ రిసార్ట్ లో జరిగే ఈ వివాహ వేడుకలో దగ్గుబాటి అండ్ అక్కినేని కుటుంబాలు పాల్గొనబోతున్నాయి.