English | Telugu
పాపం...సరదాగా చేసి ఫీలయ్యింది
Updated : Mar 12, 2014
మగాళ్ళకు గడ్డం పెరుగుతుంది కాబట్టి షేవ్ చేసుకుంటారు. మరీ ఆడవాళ్ళు కూడా చేసుకుంటే "పిచ్చి" అని అంటారు. అయితే ఇలాంటి పిచ్చి పని బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ చేసింది. తను షేవ్ చేసుకుంటూ ఒక ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్ ను రోహన్ శ్రేష్ఠ తీసారు. ఈయన ఈ ఫోటోలను నేరుగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసేసాడు. అంతే... ఈ అమ్మడిపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. అంతటితో ఊరుకోకుండా సోనమ్ తండ్రి అనిల్ కపూర్ పై కూడా కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ విషయం తెలుసుకున్న సోనమ్ స్పందిస్తూ... అది కేవలం సరదాగా చేసింది మాత్రమే. దాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. అయిన నాపై ఎన్ని కామెంట్లు చేసిన పర్వాలేదు కానీ మా నాన్న మీద ఏమైన కామెంట్లు చేస్తే మాత్రం ఊరుకోను అంటూ వార్నింగ్ ఇచ్చేసింది. మరి ఇలాంటి పనులు చేయకముందు ఆలోచించాలి. అంతే కానీ అంతా అయిపోయాక ఏడిస్తే ఏం లాభం. అయిన ఈ అమ్మడి తీరు బాగా ముదిరిపోయిందని బాలీవుడ్ టాక్.