English | Telugu
అమితాబ్ ను మెప్పించారట..!
Updated : Mar 12, 2014
బాలీవుడ్ దర్శక ద్వయం అబ్బాస్-మస్తాన్ త్వరలో ఓ థ్రిల్లర్ తరహ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటించనున్నారు. ఈ విషయాన్నీ ఈ దర్శకులు తెలియజేస్తూ..."మేము అమితాబ్ ను కలిసి కథ వినిపించాం. కథ చాలా నచ్చింది. నేను తప్పకుండా చేస్తానని మాటిచ్చారు. ఇందులో ఆయనతో పాటు ఇద్దరు కథానాయకులు, ఇద్దరు నాయికలు నటించబోతున్నారు. అనుకోకుండా జరిగిన ఓ హత్య తర్వాత కథ మలుపు తిరుగుతుంది. ఆ హత్య వెనుక ఎవరున్నారు అనేదే మిస్టరీ" అని అన్నారు.