English | Telugu

కబడ్డి ఆడండి - సోనాక్షి సిన్హా


దబాంగ్ లేడీ సోనాక్షి బాలీవుడ్ లో హిట్ మీద హిట్ కొడుతూ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది. డాన్స్, పర్‌ఫార్మెన్స్, లక్కు అన్నీ కలిసిన సోనాక్షి కన్ను ఇప్పుడు స్పోర్ట్స్ మీద పడింది. వరల్డ్ కబడ్డీ లీగ్ తో జతకట్టింది. అంతే కాదు బ్రిటన్ హెయిరే గ్రూప్ తో కలిసి యూనైటెడ్ సింగ్స్ టీంను కూడా కొనేసింది. అక్షయ్ కుమార్, యోయో హనీసింగ్ తర్వాత ఈ లీగ్ లో చేరిన మూడో సెలబ్రెటీ సోనాక్షి.


ప్రీతీ, శిల్పా, జూహీ లాంటి నిన్నటి తరం హీరోయిన్లు క్రికెట్ లీగ్ ల వెంట వుంటే నేటి తరం కొత్త తరహా ఆలోచనలను ప్రతిబింబిస్తూ సోనాక్షి కబడ్డిని ఎంచుకుంది. ఆగస్టు 9న లండన్ లో మొదలు కాబోతున్న వరల్డ్ కబడ్డి లీగ్ మ్యాచ్ లో కోసం ఇప్పటి నుంచే డేట్లు అడ్జస్ట్ చేసుకుంటోందట సోనాక్షి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.