English | Telugu

'స్కంద' వాయిదా.. ఆ సినిమాల పరిస్థితి ఏంటి?

సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ 'సలార్' వాయిదా పడటంతో.. ఆ తేదీపై పలు సినిమాలు కర్చీఫ్ వేస్తున్నాయి. సెప్టెంబర్ 28న 'మ్యాడ్', 'రూల్స్ రంజన్' సినిమాలు విడుదల కానున్నట్లు అధికారిక ప్రకటనలు వచ్చాయి. అలాగే సెప్టెంబర్ 29న 'పెదకాపు-1' విడుదల కాబోతోంది. 'సలార్' వాయిదాతో ఈ సినిమాలకి భలే లక్ కలిసొచ్చింది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే 'స్కంద' రూపంలో షాక్ తగిలే ఛాన్స్ ఉంది.

రామ్ పోతినేని, శ్రీలీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా ఫిల్మ్ 'స్కంద'. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మించిన ఈ సినిమాని సెప్టెంబర్ 15న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఇప్పుడు 'సలార్' వాయిదా పడటంతో సెప్టెంబర్ 28కి రావాలని 'స్కంద' టీం డిసైడ్ అయింది. అదే ఇప్పుడు 'మ్యాడ్', 'రూల్స్ రంజన్', 'పెదకాపు-1' సినిమాలకు తలనొప్పిలా మారే అవకాశముంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ కి మంచి మార్కెట్ ఉంది. పైగా దర్శకుడు బోయపాటి శ్రీను సినిమాలకి మాస్ లో ఉండే క్రేజే వేరు. ఈ ఇద్దరు కలిసి చేసిన మొదటి సినిమా, అందునా పాన్ ఇండియా సినిమా కావడంతో ఇప్పటికే 'స్కంద'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ సమయంలో విడుదల కానున్న మిగతా సినిమాలతో పోలిస్తే 'స్కంద'నే మొదటి ఛాయస్ అవుతుంది అనడంలో సందేహం లేదు. అంటే 'సలార్' స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత ఇతర సినిమాలపై ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. మరి 'సలార్' వాయిదా పడిందన్న ఉత్సాహంలో ఆ తేదీపై కన్నేసిన కుర్ర హీరోలు.. 'స్కంద' ధాటికి తట్టుకొని నిలబడతారేమో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.