English | Telugu
మొట్టమొదటి సిక్స్ ప్యాక్ చేసింది నా కొడుకే.. చాలా గర్వ పడుతున్నాను
Updated : Apr 19, 2025
స్టార్ హీరో 'సూర్య' (Suriya)మే 1 న తన అప్ కమింగ్ మూవీ 'రెట్రో'(Retro)తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. విభిన్న చిత్రాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్(Karthik subbaraj)తెరకెక్కించిన ఈ మూవీలో సూర్య సరసన 'పూజాహెగ్డే'(Pooja Hegde)జత కట్టగా జయరామ్, జోజు జార్జ్, కరుణాకరన్, నాజర్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2 డి ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిన్న ఆదివారం రెట్రో ఆడియో రిలీజ్ కార్యక్రమం చెన్నైలో అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది.
ఈ వేడుకకి సూర్య తండ్రి శివకుమార్(Sivaraj KUmar)ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా సూర్య ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతు కెరీర్ స్టార్టింగ్ నుంచి ప్రస్తుతం ఉన్న స్టేజ్ కి రావడానికి నా కుమారుడు సూర్య చాలా కష్టపడ్డాడు. రోజుకి నాలుగు గంటలు ఆగకుండా డాన్స్ ప్రాక్టీస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్ర లేచి బీచ్ కి వెళ్లి స్టంట్స్ నేర్చుకునే వాడు. కోలీవుడ్ కి సిక్స్ ప్యాక్ ని పరిచయం చేసింది కూడా సూర్యనే. సూర్య విషయంలో నేను చాలా గర్వ పడుతున్నానని చెప్పుకొచ్చాడు. తండ్రి మాటలకి సూర్య ఎమోషల్ గా ఫీల్ అవ్వడం జరిగింది.
శివకుమార్ కూడా ఒకప్పుడు తమిళనాట మంచి పేరున్న హీరో. 1965 లో 'కాకుమ్ కరంగల్' తో సినీ రంగ ప్రవేశం చేసిన శివకుమార్ అనేక చిత్రాల్లో నటుడుగా రాణించి ఆ తర్వాత సోలో హీరోగా 'అన్నాకిలి' తో ఎంట్రీ ఇచ్చాడు. భద్రకాళీ, వాండి చక్రం, పాసా పఱైవగల్, చిట్టు కురువై ఇలా సుమారు 190 సినిమాల దాకా నటుడుగా హీరోగా రాణించాడు. చివరగా 2001 లో వెండి తెరపై కనపడగా మూడు సార్లు ఫిలింఫేర్ అవార్డుతో పాటు రెండు సార్లు తమిళనాడు స్టేట్ అవార్డులు గెలుచుకున్నాడు.