English | Telugu

అజిత్‌కు అలవాటుగా మారిన ప్రమాదాలు.. ఈసారి బెల్జియంలో..!

తమిళ్‌ స్టార్‌ హీరో అజిత్‌ నటుడే కాదు, రేసర్‌ అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. సినిమాలంటే ఎంత మక్కువో రేసింగ్‌ అంటే కూడా అతనికి అంత మక్కువ. సినిమాలు చేస్తూనే కార్‌ రేసుల్లో, బైక్‌ రేసుల్లో పాల్గొంటూ ఉంటాడు. ఇటీవల దాని కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు అజిత్‌. వివిధ దేశాల్లో జరిగే రేసుల్లో పాల్గొంటూ ప్రపంచయాత్ర చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో, రేసుల పాల్గొన్న సమయంలో పలు ప్రమాదాలకు గురయ్యారు అజిత్‌. అయితే ఏ ప్రమాదంలోనూ గాయపడకుండా సురక్షితంగా బయట పడడం విశేషం. ఇప్పటికే నాలుగైదు ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు అజిత్‌.

తాజాగా బెల్జియంలో జరిగిన కార్‌ రేసులో పాల్గొన్నారు అజిత్‌. రేస్‌లో కార్లను ఎంత వేగంగా డ్రైవ్‌ చేస్తారో అందరికీ తెలిసిన విషయమే. ఇందులో ప్రమాదాలు జరగడం అనేది సర్వసాధారణం. ప్రతి రేసులోనూ కొందరు రేసర్లు ప్రమాదాలకు లోనవుతూ ఉంటారు. ఇటీవలి కాలంలో వరస ప్రమాదాలను ఎదుర్కొంటున్న అజిత్‌.. బెల్జియం కార్‌ రేసులో మరోసారి ప్రమాదానికి గురయ్యారు. అతను డ్రైవ్‌ చేస్తున్న కారు ట్రాక్‌ తప్పి పక్కకి దూసుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ఇందులోనూ ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డారు అజిత్‌.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.