English | Telugu
సింగనమల రమేష్ ని సినీ ప్రముఖులే ముంచారట
Updated : Jun 29, 2011
సింగనమల రమేష్ ని సినీ ప్రముఖులే ముంచారట అని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో "ఖలేజా"చిత్రాన్నీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, యస్.జె.సూర్య దర్శకత్వంలో "కొమరంపులి" చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ సినీ ఫైనాన్సియర్, సినీ నిర్మాత సింగనమల రమేష్ మీద అనేక ఆరోపణలు వచ్చాయి. అందుకు తగ్గట్టే అతన్ని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు కూడా.మద్దులచెరువు సూరితో సింగనమలకు అనుబంధం ఉండేదనీ, అనంతరం సూరీ హత్య తర్వాత సూరీని హత్యచేసిన భాను కిరణ్ తో సింగనమలకు అనుబంధం ఉందనీ, భాను కిరణ్ ఆస్తులన్నీ బినామీ పేర్లతో సింగనమల రమేష్ అధీనంలోనే ఉన్నాయనీ, తనకు 7.50 cr ఫైనాన్సిచ్చిన వైజయంతీ రెడ్డిని సింగనమల రమేష్ బెదిరించాడనీ ఇలా అతని మీద ఉన్న ఆరోపణలకు కొదువ లేదు.
అలాగే ప్రముఖ సి.కళ్యాణ్ తో కూడా సింగనమల రమేష్ కు ఫైనాన్సియల్ అనుబంధం ఉందనీ పోలీసులు అనుమానిస్తున్నారు. దానికి తగ్గట్టే సి.కళ్యాణ్ ముందస్తు (యాంటిసిపేటరీ) బెయిల్ కోసం దరఖాస్తుచేసుకున్నాడు. ఇవన్నీ పక్కన పెడితే మన తెలుగు సినీ పరిశ్రమలోని ఆరుగురు పెద్దలు సింగనమల రమేష్ వద్ద ఫైనాన్స్ గా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోగా, సింగనమల రమేష్ ఫోన్ చేస్తే సమాధానం కూడా చెప్పటం లేదట. అలా ఆరుగురు సినీ పెద్దలు సింగనమలకు ఇవ్వాల్సిన మొత్తం 60 కోట్లకు పైగానే అని తెలిసింది. వీరంతా ప్రముఖ నిర్మాతలే కావటం విశేషం. వారిలో ఈ మధ్య రెండక్షరాల పేరు మీద వచ్చిన సినిమాతీసిన మెగా ప్రొడ్యూసర్ ఒకరు కాగా, నాలుగక్షరాల పేరు మీద సినిమా తీసిన మెగా నిర్మాత మరొకరు, డైలాగ్ కింగ్ గా పేరుతెచ్చుకున్న నట నిర్మాత ఒకరూ, రికార్డులు సృష్టించిన సీనియర్ నిర్మాత ఒకరూ, నటన నుండి రియల్ ఎస్టేట్ దందాలోకి దిగి జయభేరి మ్రోగించిన సీనియర్ నటుడు ఒకరూ...ఇలా సింగనమల రమేష్ కు డబ్బెగ్గొట్టిన వారిలో ఉన్నారట. ఇదే సందు అదే సందు అని ఈ ప్రముఖ నిర్మాతలు సింగనమల రమేష్ కి ఇవ్వాల్సిన డబ్బుని ఎగ్గొట్టే సన్నాహాలు చేస్తున్నారు. వీళ్ళందరి మీద "పాపం వీరంతా డబ్బున్న దరిద్రులు" అని సింగనమల రమేష్ కామెంట్ కూడా చేశాడట కూడా....